KTR : విద్వేషాలను రెచ్చగొట్టే విభజన శక్తులను మీడియా బయటపెట్టాలి..!!

  • Written By:
  • Publish Date - November 13, 2022 / 06:52 AM IST

మతం ముసుగులో విభజన శక్తులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని…అలాంటి శక్తుల కుట్రలను మీడియా బహిర్గతం చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ సహకారంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆద్వర్యంలో మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన జాతీయ సెమినార్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు కేటీఆర్. కొన్ని పరిశోధనాత్మక కథనాలను కేటీఆర్ ఉదహరించారు. గత ప్రభుత్వాలను పడగొట్టారని…ఇవాళ్టి భారతదేశంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కనిపించడం లేదన్నారు.

అదానీ ఒత్తిడి వల్ల 6వేల కోట్ల విలువైన కాంట్రాక్టుకు డిపార్ట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చిందని…శ్రీలంక ఇంధన శాఖ అధిపతి ఆరోపణలు చేసినప్పుడు దేశంలో ఏ మీడియా కూడా వాస్తవాలను ప్రచురించడానికి ముందుకు రాలేదన్నారు. గత 8ఏళ్లగా మన్ కీ బాత్ నిర్వహిస్తున్నారని ….జర్నలిస్టులతో ప్రధాని మాట్లాడారా అని ప్రశ్నించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న రూపాయి, ఉపాధిరేటు, ప్రపంచ ఆకలి సూచి 55 నుంచి 107కి పడిపోయిందని…హలాల్ నాన్ హలాల్ హిజాబ్ వార్తలతో ఆదిపత్యం చేలాయిస్తుందన్నారు.

2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో చాలా మీడియా సంస్థలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేశాయని గుర్తు చేశారు. మీడియా నుంచి ఎలాంటి మద్దతు లేదన్నారు. అయితే జర్నలిస్టులు టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారని కేటీఆర్ గుర్తు చేశారు.