Site icon HashtagU Telugu

BIG Shock to KTR : కాంగ్రెస్ లో చేరిన కేటీఆర్ బావమరిది

Ktr Brother In Law Edla Rah

Ktr Brother In Law Edla Rah

కేసీఆర్ (KCR) చెప్పిన లెక్క ఏదో తేడా కొడుతుందే..లోక్ సభ ఎన్నికల ఫలితాల (Lok Sabha Elections Results) వరకు కూడా బిఆర్ఎస్ (BRS) లో ఎవరు ఉండేలా కనిపించడం లేదు. రేవంత్ స్పీడ్..కాంగ్రెస్ నేతల జోరు చూస్తుంటే మరో నెల రోజుల్లో కారును ఖాళీ చేసి షెడ్డు కు పెంపించేలా ఉన్నారు. ఎందుకంటే ఒకరిద్దరు కాదు వరుసపెట్టి ప్రతి రోజు బిఆర్ఎస్ కు రాజీనామా చేయడం..చేసిన కాసేపట్లోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ రోజు రోజుకు కాంగ్రెస్ బలం పెంచుతున్నారు. నిన్న , మొన్నటి వరకు బిఆర్ఎస్ నేతలు మాత్రమే చేరగా..ఈరోజు ఏకంగా కేసీఆర్ ఫ్యామిలీ సభ్యుడే కాంగ్రెస్ లో చేరడం కేసీఆర్ పరువు మరింత పోయేలా చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు (KTR Brother In Law Edla Rahul) కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి దూరపు బంధువు, కేటీఆర్‌కు వరుసకు బావమరిది అయినా ఎడ్ల రాహుల్ రావు..ఈరోజు మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ రావుకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్ రావు కేటీఆర్ కి కుడి భుజంలా ఉండేవారని అందరికి తెలిసిందే. అలాంటి ఆయన ఈరోజు సొంత పార్టీని , బావని విడిచిపెట్టి కాంగ్రెస్ లోకి వచ్చారంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది. రోజు రోజుకు బిఆర్ఎస్ పరిస్థితి దారుణంగా అవుతుండడం తో బీఆర్ఎస్ నేతలు లోలోపల మదన పడుతూనే పైకి మాత్రం మేకపోతు గాంబీర్యం ప్రవర్తిస్తున్నారని ఇలాంటి ఘటనలు చూస్తే అర్థం అవుతోంది.

కేసీఆరేమో మాతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కార్యకర్తలకు కాస్త భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంటే, వెనుకాల మాత్రం వరుస పెట్టి బిఆర్ఎస్ నేతలు పార్టీకి గుడ్ బై చెపుతూ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. బయట వ్యక్తులు అంటే ఏమో కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులే ఈ విధంగా పార్టీని నమ్మకుంటే మిగతా లీడర్లు ఏ మేరకు నమ్ముతారని అందరు మాట్లాడుకునే ప్రశ్నే. ఏది ఏమైనప్పటికి కాలం ఎప్పటికి ఒకేలా ఉండదని..అధికారం కూడా ఒకరి దగ్గరే ఉండదని బిఆర్ఎస్ పరిస్థితి చూస్తే అర్ధం అవుతుంది. పదేళ్ళపాటు తాను చెప్పిందే జరగాలనే ధోరణి లో ఉన్న కేసీఆర్..నేడు ఏ ఒక్క నేత కూడా తన వెంట ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.

Read Also : Amit Shah: 400 ఫిగర్ ప్పై అమిత్ షా క్లారిటీ ఇదే..