KTR Blocks Cong Handle: కాంగ్రెస్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ ను బ్లాక్ చేసిన కేటీఆర్‌

కాంగ్రెస్, టీఆర్ఎస్ మ‌ధ్య జ‌రిగిన ట్విట్ల యుద్ధంలో మంత్రి కేటీఆర్ ఔట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ను బ్లాక్ చేసి ప‌రార్ అయ్యారు.

  • Written By:
  • Updated On - May 6, 2022 / 03:27 PM IST

కాంగ్రెస్, టీఆర్ఎస్ మ‌ధ్య జ‌రిగిన ట్విట్ల యుద్ధంలో మంత్రి కేటీఆర్ ఔట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ను బ్లాక్ చేసి ప‌రార్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ ట్విట్ట‌ర్ వారియ‌ర్స్ కేటీఆర్ మీద సోష‌ల్ మీడియా వేదిక‌గా సెటైర్లు దంచుతున్నారు. ఆయ‌న మాన‌సిక స్థితిని ప్ర‌శ్నిస్తున్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా కాంగ్రెస్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌లేక ఆయ‌న తోక‌ముడిచార‌ని వ్యంగ్యాస్త్రాల‌ను సంధిస్తున్నారు. రాహుల్ స‌భ పై గ‌త రెండు రోజుల నుంచి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు మార్గాల్లో అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఓయూకు రాహుల్ ను అనుమ‌తించ‌క పోవ‌డంతో ట్విట్ట‌ర్ వార్ తారాస్థాయికి చేరింది.

హ‌ఠాత్తుగా కాంగ్రెస్ పార్టీ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ను మంత్రి కేటీఆర్ బ్లాక్ చేయ‌డం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. కేటీఆర్ నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ పార్టీ నేత‌లు, ఆ పార్టీ అభిమానులు ఓ ఆట ఆడుకుంటున్నారు. కాంగ్రెస్ చెప్పిన మాట నిజ‌మేన‌ని, ఆ పార్టీ అడిగే ప్ర‌శ్న‌ల‌కు బ‌దులివ్వ‌లేకే కేటీఆర్ ఆ పార్టీ ట్విట్ట‌ర్‌ను బ్లాక్ చేశారంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో టీఆర్ఎస్ ట్విట్ట‌ర్ వారియ‌ర్స్ రంగంలోకి దిగారు. గ‌తంలో టీఆర్ఎస్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ను బ్లాక్ చేసిన రేవంత్ రెడ్డి వాల‌కాన్ని వెలుగులోకి తెచ్చారు. సెటైర్లు వేస్తూ టీఆర్ఎస్ క్యాడ‌ర్ రేవంత్ కు , కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా పోస్ట్ లు పెడుతోంది.

గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాను బ్లాక్ చేస్తూ టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై శుక్ర‌వారం ఆక‌స్మాత్తుగా నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున‌ తాము అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేని కార‌ణంగానే ఖాతాను బ్లాక్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ ప్ర‌శ్న‌ల‌ను చూసి కేటీఆర్ గ‌జ‌గ‌జ వ‌ణికిపోయార‌ని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఓ జాతీయ పార్టీ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌నే బ్లాక్ చేయ‌డంతో కేటీఆర్ మాన‌సిక స్థితి ఏమిటో ఇట్టే తెలిసిపోతోంద‌ని కాంగ్రెస్ విమ‌ర్శ‌లు గుప్పించింది. ఆ మేర‌కు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్‌పెట్టింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ను బ్లాక్ చేస్తూ కేటీఆర్ తీసుకున్న నిర్ణ‌యంపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.