Site icon HashtagU Telugu

TRS Insurance: కేటీఆర్ ధీమా.. టీఆర్ఎస్ కార్యకర్తలకు ‘బీమా’!

Insurance

Insurance

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యాన్ని మరోసారి కల్పించింది. గత ఆరు సంవత్సరాలుగా కార్యకర్తల కోసం ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించిన టిఆర్ఎస్ పార్టీ ఈ సంవత్సరం సైతం ఏడవసారి ప్రమాద బీమా ప్రీమియాన్ని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించింది. ఈ మేరకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా భీమా కంపెనీకి ప్రమాద బీమా కోసం చెల్లించే ప్రీమియం  చెక్కుని అందించారు.

ఇప్పటిదాకా టిఆర్ఎస్ పార్టీ గత ఏడు సంవత్సరాలుగా సుమారు 66 కోట్ల రూపాయల బీమా ప్రీమియంను చెల్లించింది. పార్టీ కల్పించిన ఈ ప్రమాద బీమా సౌకర్యం వలన అకస్మాత్తుగా వివిధ ప్రమాదాల్లో చనిపోయిన 7000 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచింది. పార్టీ చెల్లించిన ఈ బీమా సౌకర్యం వలన 70 సంవత్సరాల లోపు ఉన్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికి ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుంది. ఏదైనా ప్రమాదంలో దురదృష్ట దురదృష్టవశాత్తు మరణం సంభవిస్తే రెండు లక్షల రూపాయలు పూర్తిగా వికలాంగులు అయితే లక్ష రూపాయలు పాక్షికంగా వికలాంగులైతే 50 వేల రూపాయల బీమా భరోసా అందుతుంది.

ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి బృందానికి ఈ చెక్కును అందజేశారు. టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తో పాటు పార్టీ భీమా వ్యవహారాల, జనరల్ సెక్రెటరీ సోమ భరత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.