Site icon HashtagU Telugu

KTR’s Birthday: బర్త్ డే వేడుకలకు కేటీఆర్ దూరం

Ktr

Ktr

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన బర్త్ డే వేడుకులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వర్షాల వల్ల పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం కింద ప్రజలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబరాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కోరారు. అయితే టీఆర్ఎస్ నాయకులు మాత్రం కేటీఆర్ పుట్టినరోజు సంబురాలు చేసుకునేందుకు ఏర్పాటు చేస్తుండటం కొసమెరుపు.