Site icon HashtagU Telugu

Telangana: ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలపై కేటీఆర్ ఫైర్

Telangana

Telangana

Telangana: నిన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న తెలంగాణ రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదలకు కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ శ్వేతపత్రాలపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ముచ్చటించిన కేటీఆర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి బడ్జెట్ లో అప్పులపై వివరాలు అసెంబ్లీలో ఉంటాయని కేటీఆర్ తెలిపారు.అసెంబ్లీలో పెట్టే ఆడిట్ రిపోర్టులే శ్వేతపత్రాలని స్పష్టం చేశారు. వాటిని కాంగ్రెస్ నేతలు చదవకపోతే ఏం చేస్తారని కేటీఆర్ అన్నారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడు హామీలు ఇచ్చారో తెలియదా..? లెక్కలు చేయకుండా వాగ్దానాలు చేశారా? అని కేటీఆర్ అన్నారు. తాము ఉన్నప్పుడు ఉన్న పరపతి ఇప్పుడు ఎక్కడ పోయిందో చెప్పాలన్నారు. పరపతి లేకుండా తమకు కూడా అప్పులు పుట్టవు కదా అని ప్రశ్నించారు. రుణమాఫీపై కేటీఆర్ కూడా స్పందించారు. రాహుల్ గాంధీ 24 గంటల్లో రుణమాఫీ అన్నారు. 24 గంటల్లో రుణమాఫీ అని రాహుల్ గాంధీ చెప్పారన్న కేటీఆర్ ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: Tusli Plant : తులసి మొక్కకు నీళ్లు పోసే విషయంలో ఆ 4 తప్పులు అస్సలు చేయకండి.. అవేటంటే?