Site icon HashtagU Telugu

KTR: మంత్రి దామోదర కుమార్తె వివాహానికి హాజరైన కేటీఆర్

Damodar Raja Narasimha

Damodar Raja Narasimha

KTR: తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ కుమార్తె వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఫిలింనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌కు మధ్యాహ్నం ఒంటిగంటకు కేటీఆర్ వెళ్లారు. అతను వేదిక వద్దకు వచ్చిన వెంటనే, అతిధేయులు అతనిని పెళ్లి మండపంలోకి తీసుకెళ్లారు. ఈ సమయంలో జనాలు కేటీఆర్ ని చుట్టుముట్టారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలు నిర్వహించే కార్యక్రమాలకు, వివాహాలకు కూడా హాజరుకావడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ సంప్రదాయం రాజకీయంలో ఎప్పటినుంచో కనిపిస్తుంటుంది.

కేటీఆర్‌తో సెల్ఫీ దిగేందుకు పెళ్లికి హాజరైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుంది. పలువురు తమ తమ మొబైల్ ఫోన్‌లో కేటీఆర్ రాకను వీడియోలో బంధించడం కనిపించింది. కేటీఆర్ వేదిక వద్దకు వెళ్లి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని అభినందించారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వేదిక వద్దకే కేటీఆర్ రావడంతో అక్కడ సందడి నెలకొంది. అంతకుముందు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు.

Also Read: Dharani Portal : ధరణి మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం