Site icon HashtagU Telugu

KTR : ప‌ట్వారీ వ్య‌వ‌స్థ వద్దు – ధరణి ముద్దు – కేటీఆర్

Ktr Kamareddy

Ktr Kamareddy

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ (BRS) దూకుడు చూపిస్తుంది. ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ (Congress) కు బలం పెరుగుతుండడం తో ఎక్కడిక్కడే ఆ బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు తాజాగా ప్రకటించిన మరో 62 హామీల ఫై బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు లు ముగ్గురు విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే మళ్లీ చీకటి తెలంగాణ అవుతుందని , రైతుబంధు , ధరణి లను తీసివేస్తారని ప్రచారం చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా కామారెడ్డి (Kaamareddy)నియోజ‌క‌వ‌ర్గం పెద్ద‌మ‌ల్లారెడ్డిలో నిర్వ‌హించిన రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ఎత్తేసి ప‌ట్వారీ వ్య‌వ‌స్థ తీసుకురావాల‌ని చూస్తున్నారు.. ప‌ట్వారీలను తీసుకొచ్చి మ‌ళ్లీ మ‌న జీవితాల‌ను ఆగం చేస్తార‌ట‌..? రైతుల‌ను చావ‌గొట్టి ద‌ళారుల రాజ్యం తెస్తామ‌ని అంటున్నారు. 24 గంట‌ల క‌రెంట్ కావాలంటే కేసీఆర్‌కు ఓటేయండి. ప‌ట్వారీ వ్య‌వ‌స్థ వ‌ద్దు.. ధ‌ర‌ణి ముద్దు అనేటోళ్లు మాకు ఓటేయండి. ధ‌ర‌ణిలో కూడా ఇబ్బందులు ఉండొచ్చు. ఏమ‌న్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మంచిగా చేసుకుందాం. ఎలుక‌లు ఉన్నాయ‌ని చెప్పి ఇల్లును కాల‌బెట్టుకోం క‌దా..? ధ‌ర‌ణి కూడా 90 శాతం మంచిగా ఉన్న‌ది. ఆ ప‌ది శాతం కూడా స‌రి చేసుకుందాం. పాత ప‌ట్వారీ వ్య‌వ‌స్థ వ‌ద్దు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఎన్న‌టికైనా మ‌నోడు మ‌నోడు అయిత‌డు.. మందోడు మందోడు అయిత‌డు. తెలంగాణ‌పై కేసీఆర్‌కు ఉండే ప్రేమ రాహుల్, మోదీకి ఉంట‌దా..? మ‌రి మ‌నోడిని గెలిపించుకుందామా..? లేక‌పోతే ఢిల్లీ వాళ్ల‌ను నెత్తి మీద పెట్టుకుందామా..? ఆలోచించండి. కామారెడ్డికి వ‌స్తున్న కేసీఆర్‌ను ఆశీర్వ‌దించండి. ఈ ప్రాంతం రూపురేఖ‌లు మారిపోతాయి. కేసీఆర్ వ‌చ్చిండు అంటే బ్ర‌హ్మాండ‌మైన అభివృద్ధి ప్ర‌తి గ్రామంలో జరుగుతుందన్నారు.

Read Also : Netanyahu Vs Unnithan : నెతన్యాహును కాల్చి చంపేయాలి.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు