KTR : శ్రీరాముడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాదు..ఆయన అందరివాడు – కేటీఆర్

  • Written By:
  • Publish Date - April 23, 2024 / 03:31 PM IST

శ్రీరాముడు (Sriramudu) పేరు చెప్పి బిజెపి (BJP) రాజకీయాలు చేస్తుందని..శ్రీరాముడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాదు..ఆయన అందరివాడు..బిజెపి ఓడిపోయిన శ్రీరాముడికి ఏం కాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) చెప్పుకొచ్చారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ నామినేష‌న్ (Chevella MP Candidate Kasani Gnaneshwar Nomination) కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..బిజెపి , కాంగ్రెస్ పార్టీల ఫై విమర్శల వర్షం కురిపించారు.

10 ఏళ్లలో కేంద్రంలోని బిజెపి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని తెలిపారు. ఏమ‌న్న అంటే జైశ్రీరాం త‌ప్ప ఇంకోటి లేదు. తెలంగాణ‌కు ఒక్క కాలేజీ, పాఠ‌శాల ఇవ్వ‌లేదు. గుడికి పైస‌లు ఇవ్వ‌లేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వ‌లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.రాముడి పేరు చెప్పి ఓట్లు దండుకోవడమే బిజెపికి తెలుసనీ..మ‌తం పేరుతో రాజ‌కీయం చేస్తున్న బిజెపికి తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. పదే పదే బండి సంజయ్ మోడీ దేవుడంటూ చెప్పుకొస్తాడు..అసలు మోడీ దేవుడు ఎలా అవుతాడు. సిలిండ‌ర్ ధ‌ర పెంచినందుకు అవుతాడా.. ? పెట్రోల్ , డీజిల్ ధరలు పెంచినందుకు అవుతాడా..? నిత్యా అవసర ధరలు పెంచినందుకు అవుతాడా.? తెలంగాణ కు ఎలాంటి హోదాలు ఇవ్వనందుకు అవుతాడా..? ఎలా అవుతాడని కేటీఆర్ ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే కాంగ్రెస్ పార్టీ ఫై కూడా కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్-1 న‌డిచింది.. లోక్ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మోసం పార్ట్-2 సీక్వెల్ న‌డుస్తోంద‌ని కేటీఆర్ ఎద్దేవా చేసారు. ఆగస్టు 15 లోగా రైతుల రుణ‌మాఫీ చేస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌రోసారి మోసానికి య‌త్నిస్తుంద‌ని చెప్పుకొచ్చారు. మోసాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నెతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో రంజిత్ రెడ్డి ఎంపీగా, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి మంత్రిగా ప‌ద‌వులు అనుభ‌వించిన వారు త‌ల్లి లాంటి పార్టీకి మోసం చేశారు. ఈ ఎన్నిక‌ల్లో రంజిత్ రెడ్డి, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి బుద్ధి చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. అధికారం పోగానే పార్టీ నుంచి పిరికిపంద‌ల్లా జారుకున్నారు. 93 కులాల‌ను ఐక్యం చేసిన బాహుబ‌లి కాసాని జ్ఞానేశ్వ‌ర్‌. ఒక బ‌ల‌మైన నాయ‌కుడు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు గొంతుకై నిల‌బ‌డ్డాడు. అలాంటి కాసానిని గెలిపించాలి అని కేటీఆర్ కోరారు.

Read Also : Pithapuram : నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్..తరలివచ్చిన వేలాదిమంది అభిమానులు