KTR: చీమలపాడు అగ్ని ప్రమాద బాధితులకు కేటీఆర్ భరోసా!

చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను మంత్రులు కేటీఆర్ (KTR(, పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు.

  • Written By:
  • Updated On - April 13, 2023 / 12:07 PM IST

నిమ్స్ (Nims) ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను మంత్రులు కేటీఆర్ (KTR), పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. అన్నివిధాలుగా అండగా ఉంటామని వారికి కేటీఆర్ భరోసా ఇచ్చారు. బాధితులకు అందుతున్న వైద్యంపై డాక్టర్లతో అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా నిన్న ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనం కోసం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు వస్తుండటంతో కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతూ బాణసంచా పేల్చారు.

దీంతో నిప్పురవ్వలు ఎగసి పక్కనే ఉన్న గుడిసెపై పడ్డాయి. మంటలు (Fire Accident) చెలరేగడంతో గుడిసెలోని సిలిండర్ పేలింది. బాణాసంచా ధాటికి గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షలు, పూర్తిగా ఉచిత వైద్యం

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడు అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ (Puvvada Ajay) అజయ్ కుమార్ గారు ప్రకటించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయి లో అన్ని విధాలుగా వైద్య చికిత్సలు అందిస్తామని ప్రకటించారు.

Also Read: Ram Charan Pet: రామ్ చరణ్ పెంపుడు కుక్క ‘రైమ్’ ధర ఎంతో తెలుసా!