KTR Arrested: కేటీఆర్‌ ఏ క్ష‌ణ‌మైనా అరెస్ట్? ఆయ‌న ప్లాన్ ఏంటి?

ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంతో మాజీ మంత్రి కేటీఆర్ కోర్టును ఆశ్రయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
KTR Phoned Sunil Rao

KTR Phoned Sunil Rao

KTR Arrested:ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌ కాపీని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో సమర్పించారు. ఆయనపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపారు. కాగా కేటీఆర్‌పై ఏసీబీ నాలుగు నాన్ బెయిలబుల్ (KTR Arrested) సెక్షన్లతో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. గవర్నర్ అనుమతి తీసుకోవడం, సీఎస్ ఏసీబీకి లేఖ రాయడం, ఏసీబీ కేసు నమోదు చేయడం వెనువెంటనే జరిగిపోయాయి. కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్‌ రెడ్డిలు విచారణకు హాజరుకావాలని ఏసీబీ ఈరోజు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. విచారణలో నేరం చేసినట్లు తేలితే అరెస్టు చేయొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఈఫార్ములా రేస్‌ కేసు కేసులో తనను ఏ1గా పేర్కొనడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయనిపుణులతో తీవ్ర చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే FIR నమోదు కావడంతో క్వాష్ పిటిషన్‌ వేసేందుకు అవకాశం ఉందని న్యాయనిపుణులు సూచించినట్లు సమాచారం. రేపు క్వాష్‌ పిటిషన్‌ వేసే అవకాశం ఉంది.

Also Read: Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ బ‌రువు ఎంతో తెలుసా?

కేటీఆర్‌పై న‌మోదైన సెక్ష‌న్లు ఇవే

ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి KTRపై ఏసీబీ 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నాన్-బెయిలబుల్ సెక్షన్లైన 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120 B కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నేరం రుజువైతే ఏడాది నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

KTRపై అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఏ), 13(2), BNSలోని 409, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదైంది. 13(1)(ఏ): ప్రజాప్రతినిధి తన స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం లేదా తన అధీనంలోని వారికి లబ్ధి చేకూర్చడం. 13(2): ప్రజాప్రతినిధి నేరాలకు పాల్పడటం. 409: ఆస్తుల్ని సంరక్షించాల్సిన ప్రజాప్రతినిధి తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయడం, 120(B): చట్టవిరుద్ధమైన పని చేసేందుకు కుట్ర పన్నడం.

రేపు క్వాష్ పిటిషన్?

ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంతో మాజీ మంత్రి కేటీఆర్ కోర్టును ఆశ్రయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

  Last Updated: 19 Dec 2024, 11:58 PM IST