Site icon HashtagU Telugu

Formula E Race Scam : KTRను నిజంగానే అరెస్ట్ చేస్తారా..?

Ktr Arrest

Ktr Arrest

ఫార్ములా-ఈ ఆపరేషన్ (Formula E Race Scam) కు సంబంధించిన కేసులో KTRను అరెస్ట్ చేస్తారనే ప్రచారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. రూ.55 కోట్ల చెల్లింపు వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాయగా, ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అటు తనను అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చని, దేనికైనా రెడీ అంటూ KTR సైతం నిన్న ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. అక్రమంగా అరెస్టు చేస్తే జైలుకెళ్లేందుకు సిద్దమేనని తెలిపారు. ఈ అంశంలో ఏం జరుగుతుందా అని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

2023లో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం హయాంలో ఫార్ములా-ఈ కార్ రేసు నిర్వహించారు. ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు. దీంతో అప్పుడు మున్సిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ రిక్వెస్ట్ చేయడంతో 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన 2వ దఫా రేస్ నిర్వహణకు HMDA రూ.55 కోట్లు FEOకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఆర్థికశాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా ఇస్తారంటూ అధికార కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. దీనిపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్ కోసం స్పాన్సర్లు దొరకలేదంటే..ప్రమోటర్లు దొరికే వరకు తాత్కాలికంగా ప్రభుత్వం తరఫున పెట్టుబడి పెట్టామంటున్నారు కేటీఆర్. హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచడానికి ఫార్ములా ఈ రేసు కోసం అర్జెంట్‌గా రూ.55 కోట్లు కట్టాలంటే కట్టామని చెప్పుకొచ్చారు. ఇదంతా HMDAకు తెలియకుండా జరిగిందనడం సరికాదంటున్న కేటీఆర్..నవంబర్ 14న HMDA జీవో కూడా ఇచ్చినట్లు తెలిపారు.

HMDA ఇండిపెండెంట్ బోర్డు అని..HMDA నిర్ణయాలు తీసుకోవాలంటే క్యాబినెట్ ఆమోదం అవసరం లేదంటున్నారు కేటీఆర్. HMDAకు ఛైర్మన్‌గా సీఎం, వైస్ ఛైర్మన్‌గా మున్సిపల్ మినిస్టర్, ఎండీగా మెట్రోపాలిటన్ కమిషనర్ ఉంటారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కావొద్దని ఫార్ములా ఈ రేస్‌కు ఫండ్స్ రిలీజ్ చేయిమని తానే చెప్పానని తెలిపారు. ఈ క్లారిటీ తో ప్రభుత్వం చల్లబడుతుందా..? లేక ఎలాగైనా కేటీఆర్ ను అరెస్ట్ చేయాల్సిందే అని ఆయన్ను అరెస్ట్ చేస్తుందా అనేది చూడాలి. ఒకవేళ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే అది బిఆర్ఎస్ కు ప్లేస్ అవుతుంది తప్ప మైనస్ అయితే కాదని బిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహం ఉన్న ప్రజలు..కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే అది ఇంకా బిఆర్ఎస్ కు సానుభూతిగా మారుతుంది తప్ప కాంగ్రెస్ కు మేలు అయితే జరగదని భవిస్తున్నారు. చూద్దాం ఏంజరుగుతుందో..!

Read Also : New-Gen Maruti Suzuki Dzire: కొత్త మారుతి డిజైర్ ఎంత మైలేజ్ ఇస్తుంది? లాంచ్‌కు ముందే వెల్ల‌డి!

Exit mobile version