Site icon HashtagU Telugu

KTR Appeals to PM: మోదీకి కేటీఆర్ ట్వీట్…..బీజేపీని ఇబ్బంది పెట్టడానికేనా?

BRS Story

తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు. తెలంగాణలోని కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కేటీఆర్ మోదీని కోరారు.

ఏపీలోని పోలవరం, కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చినట్టే తెలంగాణలోని ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ మోదీని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటినుండో ఉంది. ఈ విషయమై ఇక్కడి బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నేతలు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇస్తారా ఇవ్వరా అనే విషయాన్ని పక్కనపెడితే ఈ డిమాండ్ తో మరోసారి బీజేపీని టీఆర్ఎస్ ఇరుకున పెట్టేలాగే కన్పిస్తోంది. వరి విషయంలో కేంద్రంలోని బీజేపీ తెలంగాణపై వివక్షత చూపిస్తోందని వాదిస్తోన్న టీఆర్ఎస్ ఇప్పుడు ఈ విషయంలో కూడా కార్నర్ చేసే అవకాశముంది.