పేపర్ చూడకుండా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పెల్లింగ్ చెప్తే రూ.50 లక్షలు పట్టే కొత్త బ్యాగు ఇస్తానని..కేటీఆర్ (KTR) బంపర్ ఆఫర్ ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ భవన్(Telangana Bhavan)లో మూసీ నదిపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Powerpoint Presentation on Musi River) ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ పై కీలక వ్యాఖ్యలు చేసారు.
మూసీని మురికి కూపంగా మార్చింది కచ్చితంగా గత పాలకులే.. అందులో సింహభాగం కాంగ్రెస్ ప్రభుత్వానిది అయితే.. కొద్దిభాగం టీడీపీ ప్రభుత్వానిది పేర్కొన్నారు. 2015లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్టు.. ఇది మా రిపోర్టు కాదు.. కాలుష్యం బారిన పడి కాలుష్యకారంగా మారిపోయిన నదులు భారతదేశంలో ఏ ఉన్నాయంటే.. అగ్రభాగాన ఉన్నది మూసీ(2015). మేం 2014లో అధికారంలో వచ్చాం. ఏడాదిలోనే మేం మురికి కూపంగా మార్చలేదు. మార్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నీవుఉన్న కాంగ్రెస్ పార్టీ, గతంలో నీవు ఉన్న టీడీపీ కలిసి మూసీని మురికి కూపంగా మార్చాయి. గబ్బుగబ్బు చేశాయని 2015లోనే రిపోర్టు వచ్చింది. బీవోడీ లెవల్స్ కూడా ఆ రిపోర్టులో పేర్కొనడం జరిగింది. రేవంత్ రెడ్డితో ఏకీభవిస్తున్నా.. మూసీని మురికి కూపంగా మార్చింది కచ్చితంగా గత పాలకులే.. అందులో సింహభాగం కాంగ్రెస్ ప్రభుత్వానిది అయితే.. కొద్దిభాగం టీడీపీ ప్రభుత్వానికి కూడా దక్కుతుందని కేటీఆర్ తెలిపారు.
నిన్న సీఎం రేవంత్ రెడ్డి దాదాపు రెండున్నర గంటల పాటు తాను ఏదో విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నానని అనుకుని తన సంపూర్ణమైన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. చేయని సర్వేలను చేసినట్టు.. అబద్ధాలు, అసత్యాలు, అర్ధ సత్యాలను అర్థంపర్థం లేని అసంబద్ద వాదనలను సంపూర్ణంగా బయపటెట్టి తన పరువు తానే తీసుకున్నారు అని కేటీఆర్ విమర్శించారు. ఇక ఓటుకు నోటు కేసులో దొరికి 9 ఏళ్లు గడుస్తున్నా రేవంత్ కు శిక్ష పడలేదని , నిన్న సమావేశంలో ఉపయోగించిన రిజువనేషన్ అనే పదానికి స్పెల్లింగ్ చెప్పాలన్నారు. పేపర్ చూడకుండా సీఎం స్పెల్లింగ్ చెప్తే రూ.50 లక్షలు పట్టే కొత్త బ్యాగు ఇస్తానని వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ బ్యాగుతో ఢిల్లీకి డబ్బులు మోయాలని సెటైర్లు వేశారు.
Read Also : India : లెబనాన్‌కు భారత్ ఆపన్నహస్తం..