Farmer protest: కాంగ్రెస్ రైతు రుణమాఫీ మోసం పై రైతు నిరసన దీక్షలు రాష్ట్రా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే చేవెళ్లలో రైతు నిరసన దీక్ష కార్యక్రమం ప్రారంభమైంది. రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr), ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) ఇతర బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇక అటు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు తాకకుండా పరిహారం అవ్వాలని.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శిం చుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం. ఈ సందర్భంగా హరీ ష్ రావు మాట్లాడుతూ….బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుకు కేసీఆర్ గారి పిలుపు మేరకు రైతు ధర్నా చేస్తున్నా మన్నారు. బాల్కొండలో పోలీసులు ధర్నాలో పాల్గొనవద్దు అని ప్రజలకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. కొండారెడ్డిపల్లిలో సరితా, విజయ రెడ్డి అనే జర్నలిస్టుల మీద దాడి చేయడం దారుణం అని ఫైర్ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
చేవెళ్లలో ప్రారంభమైన రైతు నిరసన దీక్ష కార్యక్రమం
పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BrsSabithaIndra, బీఆర్ఎస్ నాయకులు, రైతులు. pic.twitter.com/kgVdXFg9B4
— BRS Party (@BRSparty) August 22, 2024
కాగా, రైతు రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్ పోరు బాటపట్టింది. రేవంత్ సర్కార్ మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టింది. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు కదంతొక్కారు. అన్ని మండల కేంద్రాల్లో రైతుల కలిసి పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ.. నిరసన కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు.