Site icon HashtagU Telugu

KTR- Harish Rao: కేటీఆర్‌, హ‌రీష్ రావులు ఆస‌క్తిక‌ర ట్వీట్‌లు.. కాంగ్రెస్ టార్గెట్‌గా.!

KTR- Harish Rao

KTR- Harish Rao

KTR- Harish Rao: మాజీ మంత్రులు హ‌రీశ్ రావు, కేటీఆర్‌లు (KTR- Harish Rao) కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే టార్గెట్‌గా ట్వీట్‌లు చేస్తున్నారు. కేటీఆర్ రైతుల ధాన్యం కొనుగోలుపై, హైడ్రాపై త‌న ఎక్స్ ఖాతా వేదిక‌గా పోస్ట్ చేయ‌గా.. హ‌రీశ్ రావు పోలీసుల స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం, సీఎం రేవంత్ స్పందించాల‌ని ట్వీట్ చేశారు.

కేటీఆర్ ట్వీట్స్‌

దసరాకే కాదు.. దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా? కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా.. ధాన్యం కొనాలని అధికారులకు ఆదేశాలు అందవాయే.. ప్రభుత్వానికి రైతుల గోస పట్టదాయే!రాజకీయాలపై పెట్టిన దృష్టి.. ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టరు? రైతులంటే ఎందుకంత అలుసు? మీ గారడీ హామీలను రైతులు విశ్వసించి మోసపోతున్నందుకా? అర్ధించడం తప్ప అక్రోషించడం తెలియని అమాయకులైనందుకా? రాజకీయాల్లో రాక్షసక్రీడలను మానేసి..రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించండి.. దయచేసి రైతుల విషయంలో రాజకీయాలు చేయకండని కేటీఆర్ ట్వీట్ చేశారు.

మ‌రో ట్వీట్‌లో సంపద పెంచే ఆలోచనలు మావి – ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవి. మేము బంగారు బాతును చేతిలో పెడితే- మీరు పదినెలలకే చిప్ప చేతిలో పేడితిరి. నీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్న – పాతవి అమ్మాలన్న భయమే. నీ హైడ్రా దెబ్బకు హైద్రాబాద్ లో సొంతింటి కలలు కలగానే మిగిలిపాయే. నీ మూసి ముష్ఠి పనులకు కొత్తగా కట్టేటోడు లేక కట్టినా కొనేటోడు లేక రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులాయే. కాసుల పై నీ కక్కుర్తి నిర్ణయాలు – రాష్ట్రని అధోగతిపాలు చెయ్యబట్టే. నాడు నిత్యం కళకళలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు – నేడు విలవిలలాడుతూ బోసిపోయే. నీ పదినెలల పాపపు పాలనలో రాష్ట్రానికి ప్రతిరోజు నష్టమే. బంగారు తెలంగాణను బక్కచిక్కిస్తున్న నీ దౌర్బాగ్యపు పాలనకు ఇదిగో ఈ ఏప్రిల్ నుండి అక్టోబర్ లెక్కలే సాక్ష్యాలు అని మండిప‌డ్డారు.

హ‌రీశ్ రావు ట్వీట్

ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. “నేను పోలీసు కుటుంబం నుండి వచ్చిన. పోలీసుల కష్టాలు నాకు తెల్సు. ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు” అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి గారు.. అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు.? వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు.

Also Read: Where Is Raj Pakala: రాజ్ పాకాల ఎక్క‌డ‌? డ్రగ్స్ డొంక కదులనుందా?

అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా..? భేషజాలు పక్కన పెట్టి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, 10 మందిని ఉద్యోగం నుండి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకొని, సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌ని TelanganaCMOను ట్యాగ్ చేశారు.