ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అరెస్టైన విషయం తెలిసిందే. అయితే.. ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు ఎమ్మెల్యేలు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao), ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) ఢిల్లీకి బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి పయనమయ్యారు. వారితో పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య వీరు కవితతో భేటీ కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని ఈడీ సెంట్రల్ ఆఫీస్‌లో ఉన్నారు. అయితే.. ఎన్నికల నోటిఫికేషన్ రావటానికి ఒక్కరోజు ముందు కవితను అరెస్ట్ చేయడం సరికాదని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కలిసి కుట్ర చేశాయని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటే.. సోమవారం విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ (Anil), పీఆర్‌వో రాజేష్ (PRO Rajesh), ముగ్గురు సహాయకులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ సమాచారాన్ని ఈడీ రోస్ అవెన్యూ కోర్టుకు వెల్లడించింది. కవిత నివాసంలో నిన్న జరిగిన సోదాల్లో కవిత, ఆమె భర్త అనిల్ మొబైల్ ఫోన్లు, పీఆర్‌వో రాజేష్ కు సంబంధించిన రెండు ఫోన్లు, ముగ్గురు అసిస్టెంట్ల ఫోన్లు మొత్తం పది ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. వీటిని సేకరించేందుకు ఢిల్లీకి రావాలని వారికి సమాచారం అందించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను నిన్న ఈడీ అరెస్ట్ చేసి ఈరోజు రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 23 వరకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీ విధించింది. కవిత భర్తతో పాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేయడం ఈ కేసులో కీలక పరిణామం.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 23 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉంటారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసం నుంచి ఈడీ అరెస్ట్ చేసింది. న్యూఢిల్లీలోని రూస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కవితను శనివారం హాజరుపరిచారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించగా, ఈడీ తరపున ఎన్‌కే మట్టా, జోయబ్ హుస్సేన్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు కవితకు 7 రోజుల రిమాండ్ విధించింది.
Read Also : Narendra Modi : నేడు ఏపీలో ప్రధాని మోడీ పర్యటన