Site icon HashtagU Telugu

Warning : రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ని వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తా – కేటీఆర్

Ktr Revanth

Ktr Revanth

తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి మాటలను తప్పుపడుతూ, నోట్ల కట్టలతో దొరికిన దొంగను దొంగలాగానే చూస్తారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని నిర్మించిన ఉద్యమకారుల త్యాగాలను అపహాస్యం చేసేలా మాట్లాడటం తప్పని, రేవంత్ రెడ్డి నాయ‌కుడు కావడానికి అర్హుడు కాదని, ఆయన పాలన పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

Jagan 2.0 : 2027లో జగన్ 2.0 పాదయాత్ర..ఏంటి గెలుద్దామనే !!

రేవంత్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన పాలనపై పూర్తి నమ్మకం కోల్పోయినట్టు అనిపిస్తోందన్నారు. 420 హామీలతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క హామీ అయినా అమలు చేయలేకపోయింది. రైతుల పట్ల చేసిన వాగ్దానాలు వృథా అయ్యాయి. ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. తెలంగాణ చేతికి చిప్ప పట్టే పరిస్థితికి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కారణం అని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో చెప్పిన ప్రతి మాట ఇప్పుడు నిజమవుతోందని కేటీఆర్ అన్నారు.

చివరగా “ఇంకొకసారి రేవంత్ రెడ్డి మా నాయకుడు కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తా” అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇది రాజ‌కీయ విమ‌ర్శ‌ల స్థాయిని దాటి, వ్యక్తిగత దూషణల వరకు వెళ్లిందని తెలిపారు. “మేము రాజకీయంగా వ్యతిరేకిస్తాం, కానీ వ్యక్తిగత దూషణలను సహించం. నీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా నాయకుడిపై కక్షతీర్చుకుంటే చూస్తూ ఊరుకోం” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.