మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునే కేటీఆర్, హరీష్ రావు , ఈటెల రాజేందర్ లు మూసీ ఒడ్డున ఇళ్లలో నివాసం ఉండాలని , వారికీ కావాల్సిన సదుపాయాలు అందజేస్తామని..దీనికి సిద్ధమా అని సీఎం రేవంత్ సవాల్ చేసారు. ఈ సవాల్ కు కేటీఆర్ సై అన్నారు.
మూసీ ప్రాజెక్టు (Development of Musi Riverfront)పై ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మూసీ నది పునరుజ్జీవనానికి బ్యూటిఫికేషన్ అనే కాస్మొటిక్ యాడ్ చేశారు. సుందరీకరణ ఎవరికి కావాలి? మేం చేస్తోంది కాలుష్యరహిత నగరం. మేం అందాల కోసం పనిచేయడం లేదు. అందాల భామలతో కలిసి పనిచేయడం లేదు. మీకు అలాంటి ఆలోచన విధానం ఉందేమో నాకు తెలియదు. ప్రజలందరికీ తెలుసు’ అని పరోక్షంగా కేటీఆర్ (KTR) పై సీఎం విమర్శలు చేసారు.
పేదల కోసం తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే, బీఆర్ఎస్, బీజేపీలు తమపై బురద జల్లుతున్నాయని సీఎం ఆగ్రహించారు. సర్కారు విధానాలపై ఆయా పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారమని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కార్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని, ఈ మేరకు అదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. యువతకు సైతం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇండస్ట్రీయల్ సెక్టార్ ను బలోపేతం చేస్తున్నామన్నారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం పనిచేసిందిని , మూసీ పరివాహక ప్రాంతం ప్రజలను ఆదుకోవడం ఎలా అనేదానిపై దృష్టి సారించామని తెలిపారు. నగరం మధ్యలో నుంచి నది ప్రవహించే నగరం దేశంలోనే లేదు.. అలాంటి హైదరాబాద్ నగరం పాలకుల నిర్లక్ష్యంతో మురికి కూపంగా మారిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మూసీకి పునరుజ్జీవనం అందిస్తాం.. మూసీ విషయంలో చరిత్ర హీనులుగా మిగలకూడదని మంచి ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు.
మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునే నేతలు మూడు నెలలు ఆ పరీవాహక ప్రాంతంలో ఉండాలని CM రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. KTR,హరీశ్, ఈటల మూసీ ఒడ్డున ఇళ్లలో ఉంటే తానే కిరాయి చెల్లిస్తానన్నారు. లేదంటే ఖాళీ చేయించిన ఇళ్లలో అయినా ఉండొచ్చన్నారు. ఆ టైంలో వారికి ఆహారం సహా ఇతర సౌకర్యాలూ చెల్లించాలని కమిషనర్ దానకిషోర్ను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. వారు ఉండలేరని, ఉంటే ఈ ప్రాజెక్టు వెంటనే ఆపేస్తానని CM ఛాలెంజ్ విసిరారు.
ఈ సవాల్ ను కేటీఆర్ స్వీకరించారు. మూడు నెలలు కాదు మూడేళ్లు ఉంటానని స్పష్టం చేశారు. తాను గతంలో మూసీ నింబోలి అడ్డాలోనే ఉన్నట్లు తెలిపారు. మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని, రూ.26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవం అవుతుందని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు మూటలు మోయడానికి రేవంత్ రెడ్డి దొరికాడని చెప్పారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మూసీ బఫర్ జోన్‌లో ఉన్నవాళ్లను కబ్జాదారులని రేవంత్ ముద్ర వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : Drone Attack : ప్రధాని నివాసంపై డ్రోన్ ఎటాక్.. ఏం జరిగిందంటే.. ?