అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) విజయం సాధించాలని చూస్తుంది. ఈ తరుణంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..బుధువారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష చేసారు.
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ నాయకులను పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎందుకు గెలిపించాలి? ఏ కారణం చేత ఓటు వేయాలి ? బీఆర్‌ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలంటే.. తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్‌లో ఉండాలి అంటే.. తెలంగాణ అన్న మాట ధైర్యంగా ఉచ్చరించబడాలంటే.. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేకుండా కొట్లాడాలంటే.. తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు తెగేదాక అవసరమైతే నిలబడాలి.. కలబడాలంటే కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది బీఆర్‌ఎస్‌కే మాత్రమే. కాంగ్రెస్, బీజేపీతో ఎంత మాత్రం కాదు. తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష బీఆర్‌ఎస్’ అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణలో 1.82 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయామని, పార్టీ నిర్మాణంపై దృష్టి పెడితే బాగుండేదని అనే అభిప్రాయానికి వచ్చామని, చిన్న చిన్న లోపాలతోనే ఓడిపోయామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవని, బిఆర్‌ఎస్‌పై జరిగిన అసత్య ప్రచారాన్ని ఖండించలేకపోయామని వివరించారు. అమలు చేసిన పథకాలను సమర్థవంతంగా ప్రచారం చేసుకోలేకపోయామని కెటిఆర్ బాధను వ్యక్తం చేశారు. కెసిఆర్ సిఎంగా లేరు అన్న విషయాన్ని చాలా మంది వ్యవక్తపరుస్తున్నారని, అభ్యర్థుల మీద వ్యతిరేకతతో ఓటేశామని చాలా మంది అంటున్నారని కెటిఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి గెలిచిందని, కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
Read Also : Telangana: ముస్లిం యువతను ఒవైసీ రెచ్చగొడుతున్నాడు: బండి