Site icon HashtagU Telugu

Fake Videos on HCU Land : కేటీఆర్ మరో చిక్కుల్లో పడబోతున్నాడా..?

Hcu Fake

Hcu Fake

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పరిసరాల్లో 400 ఎకరాల భూమికి సంబంధించి చోటుచేసుకున్న తాజా పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. అడవిలోని జంతువులు అంటే జింకలు, నెమళ్లు భయంతో పారిపోతున్నట్టు చూపే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, వీటికి ఏఐ (AI) సహాయంతో మార్ఫింగ్ చేసి తయారు చేసినట్టు ప్రభుత్వం పేర్కొనడం, ఇప్పుడు దాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. ఈ ఫేక్ కంటెంట్‌ వల్ల ప్రజల్లో భయాందోళనలు కలిగించారని, ప్రభుత్వాన్ని దుష్ప్రచారానికి గురిచేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాచుర్యం జరుగుతుందని ప్రభుత్వం పిటిషన్‌లో స్పష్టం చేసింది.

Kadiyam Vs Palla : నేను విశ్వసంగా ఉండే కుక్కనే..నీలాగా గుంట నక్క కాదు – పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఈ ఫేక్ వీడియోలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) తీవ్రంగా స్పందించారు. సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని, స్పెషల్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఫేక్ కంటెంట్‌ను గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనితో పోలీసులు విస్తృతంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్‌లో ప్రముఖంగా ఉండే మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు విచారణకు హాజరు కావాలని ఆయనను పిలిపించారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ (BRS) శ్రేణుల్లో ఉద్విగ్నతకు దారి తీసాయి.

CBN & Pawan : బాబు పెద్ద మనసుకు పవన్ ఫిదా

క్రిశాంక్‌ విచారణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారం కేటీఆర్ వరకూ వెళ్తుందా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు, ఈ అసత్య ప్రచారానికి మాస్టర్ మైండ్ కేటీఆర్‌ అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 24న వాదనలు జరగనున్నాయి. కోర్టు పక్షాన తీర్పు వస్తే… ఈ వ్యవహారంలో అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. ఫలితంగా, ఈ HCU వివాదం కేటీఆర్‌(KTR)కు రాజకీయంగా తీవ్రమైన చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది.