KTR : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చింది – కేటీఆర్

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 03:38 PM IST

బంగారు తెలంగాణను సాధించాం..ఐదేళ్లలోనే దేశంలోనే నెం 1 రాష్ట్రం గా తీర్చిదిద్దాం..జననం నుంచి మరణం దాకా, ప్రతి దశలో మన సర్కారున్నది అనే గొప్ప భరోసా తీసుకొచ్చాం..కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, బస్తీ దవాఖానలు, మాతా శిశు ఆసుపత్రులు ఇలా ఎన్నో తీసుకొచ్చి ప్రతి రోగికి..ప్రతి మహిళకు భరోసా ఇచ్చాం..కానీ కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే బంగారు రాష్ట్రాన్ని కాస్త భరోసా లేని రాష్ట్రంగా నాశనం చేసారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితి నుంచి పోదాం పద సర్కారు దవాఖానాకే అనే ధీమాను ఇచ్చామన్నారు. జననం నుంచి మరణం దాకా, ప్రతి దశలో మన సర్కారున్నది అనే గొప్ప భరోసా తెచ్చినం అని తెలిపారు. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, బస్తీ దవాఖానలు, మాతా శిశు ఆసుపత్రులు నగరం నలుమూలలా నిర్మాణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వరంగల్ నడిబొడ్డున దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖానా నిర్మించామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జనాభాదామాషాలో మరే రాష్ట్రంలో లేనన్ని మెడికల్ సీట్లు అందిచామని స్పష్టం చేశారు. ఒకటా రెండా కేసీఆర్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం దేశ చరిత్రలోనే ఒక అరుదైన విప్లవం అని కొనియాడారు. ఈ ట్వీట్‌కు 2014 తర్వాత ప్రభుత్వ దవాఖానాల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలు, నిర్మించిన మాతా శిశు దవాఖానాలు, మెడికల్ కాలేజీలు, 100 పడకల దవాఖానాల ఫొటోలు జత చేశారు.

అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నకిరేకల్‌లో గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అని చెప్పి పచ్చి మోసం చేసాడని, మోసపోతే గోస పడుతాం అని చెప్పినం. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC election) విచక్షణతో ఓటెయ్యాలని కోరారు. ఆరు గ్యారంటీలతో అభూతకల్పనలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇన్ని అబద్ధాలు ఆడుతున్న కాంగ్రెస్‌కు ఓటుతో సరైన బుద్ధి చెప్పాలన్నారు. అలాగే విద్యుత్ కూడా సరిగా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఓట్లప్పుడు మాత్రమే రైతుబంధు ఇస్తుండు, మహిళలకు రూ.2,500 ఇస్తా అని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా నిర్లజ్జగా అబద్ధాలు ఆడుతున్నారని ఘాటుగా విమర్శించారు.