Site icon HashtagU Telugu

National Herald Case : రేవంత్ అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది – కేటీఆర్

Ktr, Revanth Reddy

నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald Case)లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేరును ఈడీ (ED) ప్రస్తావించడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. దీనిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. ‘‘యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి భారీ అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారు’’ అంటూ ఆయన ఆరోపించారు. ఇప్పటికే అధికారాన్ని పొందడానికి కాంగ్రెస్ పెద్దల పాదాలు పట్టి వందల కోట్లు ఖర్చు చేశారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Butter Milk: మజ్జిగ ఆరోగ్యానికి మంచిదే కానీ.. వీరికి మాత్రం విషం.. ఎవరు తాగకూడదంటే!

‘‘రేవంత్ అవినీతి సామ్రాజ్యం నేషనల్ హెరాల్డ్ కేసుతో బట్టబయలైంది. సీఎం పదవిని అడ్డం పెట్టుకుని గత ఏడాదిన్నరలో వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు. ప్రజలు ఇచ్చిన ఓట్లను బలంగా ఉపయోగించుకొని తన స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు’’ అన్నారు. ఈడీ నివేదికలో రేవంత్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలను తక్షణమే విచారించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇక ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడం గమనార్హం. రేవంత్ పై వచ్చిన ఈడీ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలు ఈ అంశాన్ని తీవ్రంగా ఎత్తి చూపిస్తుండగా, ప్రజలలో కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఈ కేసు మరిన్ని రాజకీయ దుమారాలు రేపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.