Site icon HashtagU Telugu

Kohli Century : కోహ్లీ సెంచరీ కొట్టి సచిన్ రికార్డు సమం చేసాడు..మనం కూడా సెంచరీ కొట్టాలి – KTR

Ktr Kohli Century

Ktr Kohli Century

World Cup 2023 లో భాగంగా నిన్న ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బర్త్‌డే బాయ్ విరాట్ కోహ్లి సెంచరీ (Kohli Century)తో సత్తా చాటాడు. టర్నింగ్ పిచ్ మీద కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. సెంచరీ కొట్టి వన్డేలలో క్రికెట్ గాడ్ సచిన్ (Sachin Tendulkar) పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు. 119 బంతుల్లో పది ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తిచేసుకున్న కోహ్లి.. టీ20, వన్డేలు కలిపి వైట్ బాల్ క్రికెట్లో 50 సెంచరీలు కొట్టిన తొలి క్రికెటర్‌గా ప్రపంచరికార్డు సృష్టించాడు. కోహ్లి సెంచరీని క్రికెట్ అభిమానులే కాదు రాజకీయ నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు. కోహ్లి సెంచరీని తమ ఎన్నికల విజయం తో పోల్చుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. కోహ్లీ సెంచరీ కొట్టి సచిన్ రికార్డు సమం చేసాడు..మనం (BRS) కూడా త్వరలో జరగబోయే ఎన్నికల్లో సెంచరీ స్థానాల్లో విజయం సాధించి మరోసారి కేసీఆర్ (CM KCR) ను సీఎం చేయాలని పిలుపునిచ్చాడు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ టెక్‌ సెల్‌వింగ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా పలువురు నేతలు మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో ఎటు చూసిన పచ్చదనం, సాగు నీరు, తాగునీరు, సమృద్ధిగా కరెంటు, సుభిక్షంగా పంటలు పండుతున్నాయని, కడుపునిండా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అభివృద్ధే కులంగా, సంక్షేమమే మతంగా పరిపాలన సాగించారని వెల్లడించారు. అలాంటి నాయకుడిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నారని విమర్శించారు.

నిన్న కోహ్లీ ఎలాగైతే సెంచరీ కొట్టి సచిన్ రికార్డు సమం చేసాడో..ఈ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి మొదలయ్యే జైత్రయాత్రతో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ సెంచరీ దాటాలని, కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Read Also : Israel Hamas War: 31 రోజుల్లో 10 వేల మంది మృతి,15 లక్షల మంది నిరాశ్రయులు