Site icon HashtagU Telugu

KTR : దటీజ్ కేటీఆర్ : గాయపపడ్డ విద్యార్థులను.. కాన్వాయ్ లో తరలించి!

మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులను హకీం పేట వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోవడంతో, ఆ ఇద్దరు విద్యార్థులకు గాయాలై రోడ్డుపై పడిపోయారు.

అదే సమయంలో అటువైపు నుంచి వస్తున్న మంత్రి కేటీఆర్‌ తన కాన్వాయ్‌ను ఆపారు. వాహనం దిగి ఆలస్యం చేయకుండా క్షతగాత్రులను హుటాహుటిన తన కాన్వాయ్‌ వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించారు. వారికి మెరుగైన ఆరోగ్య సేవలందేలా తన సిబ్బందిని అప్రమత్తం చేశారు.

https://twitter.com/IndiaObservers/status/1461023129220771842

ఈ విషయం సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడంతో కేటీఆర్ చేసిన పనికి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

లాక్ డౌన్ సమయంలో, ట్రాన్స్పోర్ట్ బందైన సందర్భంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కుటుంబాలను చూసి తన కాన్వాయ్ ఆపిన కేటీఆర్ వారి వివరాలు తెలుసుకొని అప్పటికప్పుడు ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేసి aa కుటుంబాలను తమ గమ్యస్థానాలకు చేరవేశారు.