Site icon HashtagU Telugu

Krishna Funeral: ఇక సెలవ్.. ముగిసిన కృష్ణ అంత్యక్రియలు, మహేశ్ కన్నీరుమున్నీరు!

Krishna

Krishna

సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం ఆయన కుటుంబసభ్యుల సమక్షంలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ పార్ధివ దేహానికి పోలీసులు గౌరవ వందనం చేసి నివాళులు అర్పించారు. మహాప్రస్థానం లోపలికి కేవలం కొందరిని మాత్రమే అనుమతిచ్చారు. తన తండ్రి కృష్ణ అంత్యక్రియలు నిర్వహించినప్పుడు నటుడు మహేష్ బాబు కన్నీరుమున్నీరయ్యారు. ఈ అంత్యక్రియలకు ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

అంతకుముందు హైదరాబాద్ పద్మాలయ స్టూడియోస్‌ నుంచి కృష్ణ అంతిమయాత్ర మహాప్రస్థానం వరకు కొనసాగింది. అభిమానులు దారిపొడవున పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి అభిమానులు కృష్ణ అంతిమయాత్రలో పాల్గొన్నారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా సాగిన సినీ కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ఈ నటుడు 2009లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డును కూడా అందుకున్నాడు. ఇక కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

 

Exit mobile version