Site icon HashtagU Telugu

Krishna River: ఏపీ ఎంత గింజుకున్నా.. రాజీపడే ప్రసక్తే లేదు..!!

Krishna Water

Krishna Water

శుక్రవారం కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశం జరిగింది. తెలంగాణ, ఏపీల మధ్య ఉన్న నీటి సమస్యను పరిష్కరించడంలో భాగంగా ఈ మీటింగ్ జరిగింది. దీనిలో భాగంగా పవర్ జనరేషన్ విషయంలో ఏపీ సర్కార్ వ్యక్తం చేసిన అభ్యంతరంపై తాము రాజీపడే ప్రసక్తే లేదని తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తేల్చి చెప్పారు. శ్రీశైలంలో పవర్ జనరేషన్ చేస్తున్నారని ఏపీ అభ్యంతరం చెప్పారని…విద్యుత్ అవసరాల కోసం తాము ఖచ్చితంగా ఉత్పత్తి చేస్తాం…ఆ విషయంలో తగ్గే ప్రసక్తే లేదన్నారు. డీపీఆర్ సమర్పించాలని అడుగుతున్నారని అందుకు కొంచెం సమయం కావాలని కోరారు.

2015 నుంచి తెలంగాణకు 299టీఎంసీలు, ఏపీకి 512టీఎంసీలు తాత్కాలిక కేటాయింపు చేశారన్నారు. 30లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే అవసరం ఉందని…తెలంగాణ డిమాడ్ చేసినట్లు 50శాతం  కృష్ణాజలాలు కేటాయింపు చేయలేమని బోర్డ్ చెప్పేసింది. ఈసారి 66:34 నిష్పత్తిలో నీటి పంపణికీ అంగీకరించలేమన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్ట్స్ ఉన్నాయని…ఆనో గోయింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక నీటి అవసరాలు పెరుగుతాయని తెలిపారు. మిగులు జలాలపై సబ్ కమిటీ వేయాలని నిర్ణయించామని..ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవని…క్లియర్ కట్ గా ప్రాజెక్టు రిపోర్టును బోర్డు ఛైర్మన్ కు వివరించామని రజత్ కుమార్ వెల్లడించారు.