Site icon HashtagU Telugu

Krishi Vaas App : ఈ ఒక్కటి చాలు రైతులు రోజు పొలానికి వెళ్లవలసిన పనిలేదు

Krishi Vaas App

Krishi Vaas App

ఏ రైతైనా (Farmers) ప్రతిరోజు పొలానికి వెళ్ళవల్సిందే. పొలం (The Farm)ఎలా ఉంది..? ఏదైనా చీడ పురుగు పడుతుందా..? నీరు పారుతుందా లేదా..? అనేది తెలుసుకోవడానికి రైతులంతా పొలానికి రోజులో ఏదొక సమయంలో వెళ్లి చూసి వస్తుంటారు. అయితే ఇక నుండి ఆలా ప్రతి రోజు పొలం వద్దకు వెళ్లి చూడాల్సిన పనిలేకుండా ఇంటి నుండే పొలం ఎలా ఉందనేది చూసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం టెక్నలాజి పుణ్యమా అని ఇంటినుండి అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. అయితే రైతులకు కూడా అలాంటి వెసులుబాటు కల్పించింది Krishi Vaas అనే యాప్. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్..అందులో మనకు కావాల్సిన యాప్స్ ఇన్స్టాల్ అయ్యి ఉంటున్నాయి.

ఇక ఇప్పుడు ప్రతి రైతు కూడా Krishi Vaas అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. తన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి. ఆ తర్వాత పంట విస్తీర్ణం, ఏ పంట సాగు చేస్తున్నారో అందులో పొందుపరచాలి. అలాగే ఏరోజు పంట విత్తే తేదీ అయితే ఆ తేదీని అందులో నమోదు చేస్తే చాలు, పంట కోత తేదీ ఆటోమేటిక్ గా వస్తుంది. అనంతరం సబ్మిట్ చేసిన తరువాత, పంట సరిహద్దును పొలంలో ఉండి నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా పంట నమోదుకు మూడు పద్దతులు ఉన్నట్లు స్టాల్ నిర్వాహకులు తెలిపారు. ఒకటి మ్యాప్ ఆధారంగా నమోదు చేయడం, రెండవది పొలం గట్టు వెంట నడుస్తూ నమోదు, మూడవది ఆఫ్ లైన్ విధానంలో నమోదు చేయడం కూడా యాప్ లో సలభతర విధానం ఉందన్నారు. మొత్తం బౌండరీ నమోదు చేసిన అనంతరం అప్పుడు పొలం గట్లు మనకు యాప్ లో కనిపిస్తాయి. వాటిని ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తే చాలు, జియో ట్యాగ్ విధానం ద్వారా మన పొలం సేవ్ అవుతుంది. 48 గంటల తర్వాత మనకు మన పొలం మన మొబైల్ ఫోన్లో కనిపిస్తుంది.

ఇక అంతే అసలు పొలంలో ఏం జరుగుతుంది? పొలంలో పంట పరిస్థితి, పంటకు పురుగు పట్టిందా.. పడితే మనం ఏమి చేయాలి, ఇలా అన్నీ మనం ఎక్కడి నుండైనా చూసుకోవచ్చు. రైతన్నలు ప్రతి విషయానికి పొలం వద్దకు వెళ్లకుండ, ఎక్కడి నుండైనా తన పొలాన్ని, పంట పరిస్థితిని చూసుకొనే బృహత్తర అవకాశం క్రిషి వాస్ యాప్ ద్వారా కలుగుతుంది. ఈ విషయాన్నీ ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో ఏర్పటు చేసిన రైతు గర్జన వేదికలో తెలిపారు. దీనికోసం ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసి రైతులకు ఈ యాప్ వివరాలను తెలుపడం జరిగింది.

Read Also : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘నానా హైరానా’ సాంగ్ వచ్చేసింది..రొమాన్స్ మాములుగా లేవు

Exit mobile version