ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Koushik Reddy) సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ ఓట్లను బీజేపీ అభ్యర్థికి విక్రయించారని ఆయన ఆరోపించారు. మొత్తం 15 క్రాస్ ఓట్లలో 8 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు ఉన్నాయని వెల్లడించారు.
T20I Record: టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన టీమిండియా ఆటగాళ్లు వీరే!
“ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు నాతో స్పష్టంగా చెప్పారని, వారు NDA అభ్యర్థికి ఓటు వేసినట్టు ఒప్పుకున్నారని” తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth) చంద్రబాబు(CBN)తో లింక్ పెట్టుకొని బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ ఒప్పందం ఫలితంగానే కాంగ్రెస్ ఎంపీలు తమ ఓట్లను విక్రయించారని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy)కి వెన్నుపోటు పొడిచారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జరిగిన ఈ క్రాస్ ఓటింగ్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది. ఈ ఆరోపణలతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.