Kothagudem BRS: కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కాంగ్రెస్ కంచుకోట. గత ఫలితాలు చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు స్థానిక ప్రజలు

Kothagudem BRS: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కాంగ్రెస్ కంచుకోట. గత ఫలితాలు చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు స్థానిక ప్రజలు. తెలంగాణ ఏర్పడిన మొదటి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున జలగం వెంకట్రావు గెలిచినప్పటికీ, ఆ తరువాతి ఫలితాల్లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. అయితే కాంగ్రెస్ తరుపున గెలిచిన వనమా వెంకటేశ్వర రావు కాంగ్రెస్ ను వీడి కారు గూటికి చేరారు. ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ముఖ్యంగా కొత్తగూడెంలో బీఆర్ఎస్ కు సరైన అభ్యర్థి లేరనే చెప్పాలి. అక్కడ వనమా ఉన్నప్పటికీ ఆయనను నమ్మే పరిస్థితుల్లో స్థానిక ప్రజలు లేరు. ఎందుకంటే వనమా కుమారుడు రాఘవ అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. తాజాగా ఓ కుటుంబం ఆత్మహత్యకు కారణమయ్యాడు(కేసు నడుస్తుంది). కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి భార్యను లైంగికంగా వేధించడంతో ఆ కుటుంబం పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వనమా రాజకీయా జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనని భావిస్తున్నారు రాజకీయ నిపుణులు.

కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా డా:గడల శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. అదీ కాకా జీఎస్సార్ ట్రస్ట్ నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో జీఎస్సార్ ట్రస్ట్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇవే కాకుండా విద్య, వైద్యం ఇలా అనేక కార్యక్రమాలు జీఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీంతో కొత్తగూడెంలో గడల శ్రీనివాస్ పేరు మారుమ్రోగిపోతుంది. విశేషం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఈయనకు సీఎం కెసిఆర్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. కొత్తగూడెంలో సరైన అభ్యర్థులు లేనందున శ్రీనివాస్ అయితే ఓటు బ్యాంక్ కాపాడుకోవచ్చని బీఆర్ఎస్ భావిస్తుంది. ఇప్పటికే ప్రజల్లో గడల శ్రీనివాస్ కు మంచి పేరుంది. దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే పనిలో ఆయన పలు కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు.

https://twitter.com/drgsrao?lang=en

సీఎం కెసిఆర్ అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో పొటీ చేస్తానని చెప్పారు గడల శ్రీనివాస్. తాజాగా ఆయన కొత్తగూడెంలో నిర్వహించిన జనహితం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ అవకాశమిస్తే తప్పకుండ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను కొత్తగూడెంలో పుట్టానని, కొత్తగూడెం గురించి తనకు అంతా తెలుసని అన్నారు. ఈ సందర్భంగా జీఎస్సార్ ట్రస్ట్ మొదలుపెట్టి విద్య, వైద్యం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాని తెలిపారు.

Read More: Soldiers Faint : 30 డిగ్రీల ఎండకే మూర్ఛపోయిన సైనికులు.. ఎక్కడంటే ?