Site icon HashtagU Telugu

Electric Shock : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం..ఊరంతా కరెంట్ షాక్

Electric Shock

Electric Shock

సాధారణంగా ఇంట్లో ఏదైనా వైర్ ఫెయిల్ కారణంగా ఇంట్లో పలు వస్తువులకు కరెంట్ షాక్ అనేది వస్తుంటుంది. కానీ ఒక ఊరంతా కరెంట్ షాక్ వచ్చింది. ఇంట్లో ఏ వస్తువు పట్టుకున్న కరెంట్ షాక్ వస్తుండడంతో గ్రామస్తులంతా ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలుగుట్ట తండాలో జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

గురువారం రాత్రి పలుగుట్ట తండాలో ఒక్కసారిగా ఇళ్లలో కరెంట్ షాక్ సంభవించింది. ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానికి వస్తువులను దేన్ని ముట్టుకున్నా షాక్ తగిలింది. దీంతో ఏం జరుగుతుంతో అర్థం కాక గ్రామస్తులు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కొండాపూర్ సబ్ స్టేషన్ను ముట్టడించి నిరసన తెలిపారు. దేవుడి దయతో గ్రామస్తులమంతా క్షేమంగా బయటపడగలిగామని ఒక వేళ ఏదైనా జరిగి ప్రాణాలు పోతే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Read Also : Bakrid 2024: బక్రీద్ సందర్భంగా నాలుగు రోజులు సెలవులు