Kodangal Lands Issue : కేటీఆర్ వద్దకు రేవంత్ పంచాయితీ

ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని, తమకు ఈ ఫ్యాకర్టీలు వద్దని చెబుతున్నప్పటికీ సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు

Published By: HashtagU Telugu Desk
Kondagal Ktr

Kondagal Ktr

కొడంగల్లో (Kodangal ) ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఆయన సోదరుడు తమను బెదిరిస్తున్నారంటూ దౌల్తాబాద్ మండల రైతులు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఈ విషయంలో తమకు అండగా నిలవాలని నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల రైతులు శుక్రవారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ కు వినతిపత్రం ఇచ్చారు. దుద్యాల్ మండలంలోని హకీంపేట్, పోలెపల్లి, లకచర్ల గ్రామంలో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ వద్ద మోర పెట్టుకున్నారు.

ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని, తమకు ఈ ఫ్యాకర్టీలు వద్దని చెబుతున్నప్పటికీ సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని తమకు బీఆర్ఎస్ అండగా నిలవాలని కేటీఆర్ ను కోరారు. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా ప్రభుత్వం తమ వద్ద నుంచి లాక్కునేందుకు కుట్ర చేస్తుందన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన తమ కుటుంబాలకు ఈ భూమినే జీవనాధారంగా బతుకుతున్నాయన్నారు. ఈ భూములను గుంజుకుంటే తమ జీవితాలు సర్వనాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

దీనిపై బిఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. దుద్యాల్ మండలంలో దాదాపు 3000 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు కేటీఆర్ కు వివరించినట్లు BRS ట్వీట్ చేసింది. భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని రైతులు చెప్పారని, వారికి అండగా ఉంటామని KTR హామీ ఇచ్చారని పేర్కొంది.

Read Also : Sisodia : జైలు నుండి విడుదలైన మనీష్‌ సిసోడియా

  Last Updated: 09 Aug 2024, 08:22 PM IST