Site icon HashtagU Telugu

Konda Vishweshwar Reddy : వామ్మో.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు రూ. 4568 కోట్లా..!!

Konda Pro

Konda Pro

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) నామినేషన్ల (Nominations) పర్వం కొనసాగుతుంది. ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేతలు తమ ఆస్తుల వివరాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishweshwar Reddy) దాఖలు చేశారు. బుద్వేల్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. విశ్వే‎శ్వర్‌రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో అత్యంత ధనిక లోక్‌సభ అభ్యర్థిగా వార్తల్లో నిలిచారు. ఎందుకంటే ఆయన ఆస్తుల విలువతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల (Vishweshwar Reddy’s Family assets) విలువ ఏకంగా రూ. 4568 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఆస్తుల వివరాలు చూసి అధికారులు సైతం ఓకేంత షాక్ అయ్యారు. అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, పిసిఆర్ ఇన్వెస్ట్‌మెంట్స్, సిటాడెల్ ఆర్‌సెర్చ్, కుంకుమ సొల్యూషన్స్ మరియు ఇతర కంపెనీలలో ఆయనతో పాటు ఆయన భార్య సంగీతా రెడ్డి షేర్లు ఉన్నట్లు తెలిపారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు మీద దాదాపు రూ. 1240 కోట్లు ఉండగా, అతని భార్య పేరు మీద రూ. 3208 కోట్లు, అతడి కొడుకు పేరు మీద రూ. 108 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే వీరికి రూ.11 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం కలిగి ఉన్నట్లు తెలిపారు. పుప్పాలగూడలో రెండు విల్లాలు, చేవెళ్ల, రాజేంద్రనగర్ మరియు చిత్తూరులో వ్యవసాయ భూములు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఈయనపై న్యూఢిల్లీలోని ద్వారకాలో చీటింగ్ కేసుతో సహా నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Read Also :