తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారాయి. గతంలో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగి, పరువు నష్టం దావాలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సురేఖ తాజాగా వెనక్కి తగ్గి, తాను నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. తాను అనాలోచితంగా మాట్లాడి ఉంటే చింతిస్తున్నానని, నాగార్జున కుటుంబాన్ని అవమానపరచాలనే ఉద్దేశ్యం తనకెల్లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేసిన ఆమె, కింగ్ నాగార్జున మరియు ఆయన కుటుంబానికి హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు.
IND vs SA: కోల్‌కతా టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ డౌటే?
గత ఏడాది అక్టోబర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కేటీఆర్ సినీ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని, డ్రగ్స్ అలవాటు పెట్టాడని, నాగచైతన్య–సమంత విడాకులకు కేటీఆర్ కారణమని ఆమె చేసిన ఆరోపణలు టాలీవుడ్‌లో భూకంపం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై సినీ వర్గాలు తీవ్రంగా స్పందించి, సురేఖను తప్పుపట్టాయి. ముఖ్యంగా సమంత వంటి మహిళా నటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పలువురు సెలబ్రిటీలు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన నాగార్జున కుటుంబం, తమ గౌరవాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది.
దీంతో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేయగా, మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. ఇదే సమయంలో కేటీఆర్ కూడా ఆమెపై పరువు నష్టం దావా వేయగా, విచారణలో హాజరై తన వాదనను వినిపించారు. రాజకీయాల పేరుతో వ్యక్తిగత జీవితాలను లాగడం తగదని, మహిళలను కించపరచడం అనాగరికమని విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం ఈ వివాదానికి ముగింపు పలకబోతోందన్న ఆశ వ్యక్తమవుతోంది. ఈ సంఘటన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడే ముందు ఆలోచనతో వ్యవహరించాలనే సందేశాన్ని ఇస్తోంది.
