మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha)..ఈ మధ్య వరుస వివాదాల్లో (Controversy ) నిలుస్తూ..అధిష్టానానికి , పార్టీకి తలనొప్పిగా మారుతుంది. మొన్నటికి మొన్న నాగార్జున ఫ్యామిలీ పై అనవసరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అందరి చేత ‘ఛీ’ అనిపించుకుంది. దీనిపై కోర్టు లో విచారణ నడుస్తుంది. ఇదిలా ఉండగానే తాజాగా మరోవివాదంలో నిలిచింది.
ముందు నుండి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి (MLA Revuri Prakash Reddy) వర్గీయుల మధ్య గొడవలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దసరా ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పరకాల నియోజకవర్గంలోని ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేకపోవడంతో కొండా వర్గీయులతో రేవూరి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. మరుసటి రోజు ఆ ఫ్లెక్సీ చినిగి ఉండటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి వర్గీయులు తనపై దాడికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్యే రేవూరి వర్గానికి చెందిన వ్యక్తి గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకువచ్చి కొట్టారని ఆరోపిస్తూ కొండా వర్గీయులు ఆదివారం ధర్మారం వద్ద రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న సురేఖ పోలీస్‌స్టేషన్‌కు ఆటోలో వచ్చారు. నేరుగా తమవారి వద్దకు వెళ్లి మాట్లాడారు. పోలీసులు తమను కొట్టారని వారు మంత్రికి చెప్పటంతో డీసీపీపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ నుంచే వరంగల్ నగర పోలీసు కమిషనర్ అంబర్‌కిషోర్ ఝాకు ఫోన్ చేసి ఎస్‌ఐ, సీఐ, డీసీపీలను రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇది కాస్త వైరల్ గా మారడంతో సురేఖ పై అంత విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో సురేఖ..ఈ వ్యవహారం పై స్పందించింది. ‘కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం వంటిది… కొందరు పార్టీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌లో నిర్భంధించారని తెలిసి అక్కడికి వెళ్లాను.. నిర్భంధించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నాను.. నాపై అభిమానంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు నా వెంట వచ్చారు.. అంతకు మించి అక్కడ ఏమీ జరగలేదు.. ఈ విషయాన్ని కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు.. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.. గీసుగొండ పోలీస్ స్టేషన్‌కు తన రాకను ఉద్దేశించి తమ కుటుంబం అంటే గిట్టని కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. నీతిమాలిన పనులకు పాల్పడుతున్నారు.. కొండా కుటుంబంపై బురదజల్లే చర్యలకు పాల్పడుతున్నారు’’ అంటూ మంత్రి కొండా సురేఖ ప్రకటన విడుదల చేశారు.
Read Also : Nara Lokesh : మరో యువ గళం హామీని నెరవేర్చిన లోకేష్