Site icon HashtagU Telugu

Minister Konda Surekha : లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేస్తున్న మంత్రి కొండా సురేఖ

Minister Konda Surekha

Konda Surekha

తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) గత వారం రోజులుగా డెంగ్యూ జ్వరం (Dengue Fever)తో బాధపడుతున్నారు. కనీసం లేవలేని పరిస్థితి ఉన్నారు. అయినప్పటికీ తన బాధ్యత ను నిర్వర్తిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. తెలంగాణ మహా జాతర మేడారం ఉత్సవాలు సందర్బంగా మంత్రి సురేఖ..కొద్దీ రోజులుగా మేడారం ఏర్పాట్లలో బిజీ గా ఉన్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..తమ ప్రభుత్వ హయాంలో మొదటిసారి మేడారం ఉత్సవాలు జరుగుతుండడం తో ఎక్కడ ఏ లోటు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు అందే విధంగా మంత్రి సురేఖ ఏర్పాట్లు చేస్తూ వచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో నే స్వల్ప జ్వరం వచ్చినప్పుడు కూడా దానిని ఏ మాత్రం లెక్క చేయకుండా అలానే తన పనిలో మునిగిపోయాను. దీంతో జ్వరం ఎక్కువ అయి డెంగ్యూ గా మారిపోయింది. దీంతో ఆమెను వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకొవాలని డాక్టర్లు సూచించారు. దీంతో గత వారం రోజులుగా డెంగ్యూ ఫీవర్‌తో ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల తాను ప్రజల మధ్యకు రాలేకపోతున్నానని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో బెడ్ పై ఉన్న ఆమె చేతికి సెలాన్ తో కనిపించారు.
అయితే అంత జ్వరం ఉన్నప్పటికీ తన బాధ్యతలను ఏమాత్రం పక్కకు పెట్టకుండా ఇంటి నుంచే అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మేడారం జాతర ఏర్పాట్లతో పాటు ఇతర కార్యక్రమాలపై ఆమె అధికారులను ఆరా తీశారు. ఈ విషయం తెలిసి రాష్ట్ర ప్రజలు శభాష్ మంత్రిగారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Read Also : Nikki Haley – Kamala Harris : నేను లేదా కమల.. అమెరికా అధ్యక్ష పీఠంపై మహిళ : నిక్కీ