Konda Surekha : రేవంత్ స‌మ‌ర్ధుడు కాబ‌ట్టే పీసీసీ ఇచ్చారు. కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక‌ప్ప‌టి ఫైర్‌బ్రాండ్, వరంగ‌ల్ నేత‌ కొండా సురేఖ (Konda Surekha) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము ఎట్టిప‌రిస్ధితుల్లో పార్టీ మారేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.

  • Written By:
  • Updated On - December 29, 2022 / 03:49 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక‌ప్ప‌టి ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి, వరంగ‌ల్ నేత‌ కొండా సురేఖ (Konda Surekha) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము ఎట్టిప‌రిస్ధితుల్లో పార్టీ మారేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ కుటుంబానికి రెండు టిక్కెట్లు కావాల్సిందేన‌ని తేల్చేశారు. ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో (Telangana Congress) జ‌రుగుతున్న అంత‌ర్గ‌త గొడ‌వ‌ల‌పై కూడా క్లారిటీ ఇచ్చారు కొండా సురేఖ‌. రేవంత్( Revanth Reddy) స‌మ‌ర్ధుడు కాబ‌ట్టే టీపీసీసీ ప‌ద‌వి ఇచ్చార‌ని, అటు సీనియ‌ర్లు ఇటు రేవంత్ వ‌ర్గం సంయ‌మ‌నంతో ఉంటేనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆరెస్‌, బీజేపీల‌కు (TRS, BJP ) గ‌ట్టి పోటీ ఇవ్వ‌గ‌ల‌మ‌ని అన్నారు. జ‌నంలో రేవంత్ రెడ్డికి ఉన్న ఊపు త‌మ‌కు లేద‌న్న విష‌యాన్ని సీనియ‌ర్లు అంగీక‌రించాల‌ని చెప్పారు. అతి త్వ‌ర‌లో ఖ‌ర్గేని క‌లిసి తమ డిమాండ్ల‌ను చెప్తామ‌ని అన్నారు.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతున్న రేవంత్ పాద‌యాత్ర‌కు సీనియ‌ర్లు స‌పోర్ట్ చేయాల‌న్న కొండా సురేఖ‌, పీసీసీగా ఉత్త‌మ్ (Uttam Kumar Reddy) అట్ట‌ర్ ఫ్లాప్ అయిన‌ట్టేన‌ని తేల్చేశారు. త‌మ అడ్డా వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన రాహుల్ స‌భ‌లో (Rahul Gandhi Warangal Meeting) ఎందుకు మాట్లాడ‌లేద‌నే అంశంపై కూడా క్లారిటీ ఇచ్చారు కొండా సురేఖ‌. రేవంత్‌తో పాటు పార్టీలోకి వ‌చ్చిన కొంత‌మంది పెత్త‌నం త‌మ‌కు న‌చ్చ‌లేద‌ని బాహాటంగానే చెప్పేశారు.