Site icon HashtagU Telugu

Medaram : మేడారంలో సమీక్ష.. కనిపించని కొండా సురేఖ

Konda Surekha

Konda Surekha

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర (Medaram Jathara) ఏర్పాట్లను పురస్కరించుకుని ప్రభుత్వం భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనులు సమయానికి, నాణ్యతతో పూర్తవ్వాలని. అయితే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినా, కేబినెట్‌లో విభేదాలు తగ్గే సూచనలు కనబడడం లేదు. ఇవాళ మేడారం ప్రాంతంలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు కేవలం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క మాత్రమే హాజరయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Cricketer: క్రికెట్ మ్యాచ్‌లో విషాదం.. హార్ట్ ఎటాక్‌తో బౌలర్ మృతి!

మేడారం అభివృద్ధి పనుల కాంట్రాక్టులను పొంగులేటి తన అనుచరులకు అప్పగించారని కొండా సురేఖ, ఆమె భర్త మురళీ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు బహిరంగ స్థాయికి చేరడంతో కాంగ్రెస్ అంతర్గతంగా అసౌకర్య పరిస్థితి నెలకొంది. మేడారం జాతర రాష్ట్ర స్థాయి ఘనమైన ఈవెంట్ కావడంతో ఇలాంటి ఆరోపణలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించే అవకాశముంది. మరోవైపు, పొంగులేటి వర్గం మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ , “పనులు టెండర్ ప్రకారం జరిగాయి, రాజకీయంగా మచ్చ కలపడానికి ప్రయత్నం జరుగుతోంది” అని వివరణ ఇస్తోంది.

ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ వివాదంపై ఇప్పటికే అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. “పార్టీ సత్తా ప్రజల్లో నిలబెట్టుకోవాలంటే మనం ఒకే దారిలో నడవాలి” అని ఆయన మంత్రులకు స్పష్టం చేసినా, కొండా–పొంగులేటి మధ్య కోల్డ్ వార్ తగ్గడం లేదు. మేడారం జాతర ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించినవి కావడంతో, ఈ విభేదాలు పరిష్కరించకపోతే రాబోయే నెలల్లో కాంగ్రెస్‌కు ఇది పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Cricketer: క్రికెట్ మ్యాచ్‌లో విషాదం.. హార్ట్ ఎటాక్‌తో బౌలర్ మృతి!

Exit mobile version