Site icon HashtagU Telugu

KCR: కేసీఆర్ కనిపించడం లేదు..కేటీఆర్ ఏమైనా చేసాడేమో – కొండా సురేఖ

Konda Surekha Comments On K

Konda Surekha Comments On K

తనపై కేటీఆర్ సోషల్ మీడియా లో ట్రోల్స్ చేయిస్తున్నారని చెప్పి మంత్రి కొండా సురేఖ..కేటీఆర్ (KTR) పై సంచలన ఆరోపణలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. నిన్నటికి నిన్న నాగ చైతన్య – సమంత ( Naga Chaitanya – Samantha Divorce ) విడిపోవడానికి కారణం కేటీఆర్ అని , N కన్వెన్షన్ (N Convention) కూల్చకుండా ఉండాలంటే సమంత ను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేయడం తో.. నాగార్జున..సమంత ను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఫోర్స్ చేసాడు..కానీ సమంత ఒప్పుకోలేదు…అలాంటి పని చేయనంటే..చేయనని తేల్చి చెప్పడం తో..కుటుంబంలో గొడవలు జరిగాయి. కేటీఆర్ దగ్గరికి వెళ్లకపోతే మా ఇంట్లో ఉండొద్దని నాగార్జున తెచ్చి చెప్పడంతో..ఆ పని చేయలేక సమంత విడాకులు తీసుకుంది. నాగ చైతన్య – సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే అని తేల్చి చెప్పింది. రకుల్ ప్రీతీ సింగ్ త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే అని పలువురు హీరోయిన్స్ కు మత్తుమందు అలవాటు చేసింది కేటీఆరే అని సురేఖ తెలిపింది.

మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై చిత్రసీమ తో పాటు ఇటు రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. చిత్రసీమ మొత్తం కొండా సురేఖ పై ఆగ్రహం వ్యక్తం చేయడం తో తన మాటను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించింది. మరోపక్క సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున నాంపల్లి కోర్ట్ లో పరువు నష్టం దావా వేశారు..ఇటు కేటీఆర్ సైతం లీగల్ నోటీసులు పంపించారు. ఇలా వరుస షాకులు తగిలినప్పటికీ సురేఖ మాత్రం తగ్గేదేలే అంటూ తన నోటికి పనిచెపుతుంది. ఈరోజు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. అదే సమయంలో.. కేసీఆర్ (KCR) కనపడటం లేదు.. కేటీఆర్ గొంతు పిసికి చంపేశాడేమో అని సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్లుగా ఉన్న అధికారం కోల్పోవడంతో.. ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడంలేదని కొండా సురేఖ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారన్న మంత్రి.. బీఆర్‌ఎస్‌ ఓటమికి కేటీఆరే కారణం అని విమర్శించారు.

తొమ్మిది హామీలు అమలు చేస్తే పదో హామీ ఎందుకు ఇవ్వలేదంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని, పదవీ ఆకాంక్షతోనే కేసీఆర్ ను కేటీఆరే ఏదో చేశారనే ప్రచారం జోరుగా సాగుతుందంటూ ఆమె పేర్కొన్నారు. అతనే సీఎం అనుకుని కేటీఆర్ పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారంటూ మంత్రి మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదన్నారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదంటూ ఆమె అనుమానం వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ‘అసలే కేటీఆర్‌కు పదవీ కాంక్ష ఎక్కువ. లోపల ఎమన్నా బొండిగె పిసికి సావగొట్టిండో.. తలకాయ పగలగొట్టిండో తెల్వది. మనిషి కనపడకపోతే అనుమానపడాల్సిన పరిస్థితి వస్తది కాబట్టి.. మనమందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన బాగుండాలని కోరుకుందాం’ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఏ రేంజ్ లో రియాక్షన్ ఇస్తుందో చూడాలి.

Read Also :  TGDCA : జనవరి-ఆగస్టు మధ్య కాలంలో 93 నాసిరకం మందులు.. వెల్లడించిన డీసీఏ