జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనంతరం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం వెనుక మైనార్టీ వర్గాలను ఆకర్షించే ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ప్రయత్నాలు కూడా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనే అంతర్గత చర్చలు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నాయి. ఉపఎన్నిక ఫలితాలు పార్టీకి అనుకూలంగా రాకపోతే కొందరు మంత్రులను పదవీచ్యుతులుగా చేయడం ద్వారా ప్రజల అసంతృప్తిని తగ్గించే వ్యూహం హైకమాండ్ సిద్ధం చేస్తోందని సమాచారం. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా ప్రజల్లో పార్టీ పట్ల పూర్తి సానుకూల వాతావరణం ఏర్పడలేదన్న ఆందోళన కాంగ్రెస్ నాయకత్వంలో ఉంది.
Jubilee Hills By Election : నగరవాసులకు కొత్త కష్టాలు
ఆరు గ్యారంటీలను అమలు చేయడం ద్వారా ప్రజల మనసులు గెలుచుకోవాలని కాంగ్రెస్ ఆశించినా, ఆ పథకాలు కొంత వరకు మాత్రమే రాణించాయి. ఫ్రీ బస్, రైతులకు సాయం, 500 రూపాయల సిలిండర్ వంటి పథకాలు అందిస్తున్నప్పటికీ, ఇతర గ్యారంటీలు నిలకడగా అమలుకాకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. ఈ కారణంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి నెలకొంది. మరోవైపు, కొందరు మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు, అంతర్గత విభేదాలు కూడా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కొన్ని ముఖ్యమైన మార్పులు చేయాలనే ఆలోచనలో ఉంది. ముఖ్యంగా ప్రజా వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన, లేదా సీఎం నిర్ణయాలను సవాలు చేసిన మంత్రులపై కత్తెర పడే అవకాశం ఎక్కువగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Karpooravalli: చలికాలంలో కర్పూరవల్లి తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!
క్యాబినెట్ రీషఫుల్‌లో ఎవరికీ అవకాశం వస్తుంది, ఎవరు తప్పించబడతారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి కొండా సురేఖ స్థానంలో విజయశాంతి పేరు చర్చలో ఉండగా, పొన్నం ప్రభాకర్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించి, ప్రస్తుత చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకురావాలనే ఆలోచన కూడా ఉంది. అలాగే సీఎం రేవంత్‌తో విభేదించిన జూపల్లి కృష్ణారావు భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. మరోవైపు కోమటి రెడ్డి సోదరుల్లో మార్పు చేసి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వవచ్చని ప్రచారం ఉంది. మొత్తం మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా అభిప్రాయాన్ని, అంతర్గత అసంతృప్తిని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా కేబినెట్ ప్రక్షాళన చేయడం ద్వారా ప్రభుత్వం పట్ల మళ్లీ నమ్మకం పెంపొందించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
