Site icon HashtagU Telugu

KTR: కేటీఆర్ అంకుల్.. ప్లీజ్ సేవ్ ఫ్రం స్ట్రీట్ డాగ్స్!

Ktr

Ktr

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ పరిధిలో వీధి కుక్క‌లు రెచ్చిపోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు.. వీధుల్లో ఎవరు కనిపించినా వెంబడించి మరి కరుస్తున్నాయి. దీంతో కుక్కల భయానికి బయటకు రావాలంటే భయపడి పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్దిరోజుల క్రితం ఓ బాలుడు పాఠశాలకు వెళ్తున్నసమయంలో వీధి కుక్కలు కరిచి గాయాలపాలు చేశాయి. రోజురోజుకూ కుక్కల భయం పెరిగిపోతుండటంతో పిల్లలు వినూత్న నిరసన తెలిపారు.

ఎమ్మెల్యే అంకుల్.. (KTR) దయచేసి వీధి కుక్కల నుండి మమ్మల్ని రక్షించండి’ అని #కొంపల్లి ఎస్సీ కాలనీకి చెందిన (NCL నార్త్ అవెన్యూ) పిల్లలు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలో వీధి కుక్కల బెడదపై అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

Exit mobile version