Site icon HashtagU Telugu

Komatireddy Brothers: తమ్ముడి ఘర్ వాపసికి అన్న ప్రయత్నం!

Komatireddy Bro

Komatireddy Bro

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికలతో హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్  పార్టీ వ్యూహాలు రచిస్తుంటే, వివిధ పార్టీల అసంత్రుత్పుల నేతలపై బీజేపీ గురిపెడుతోంది. ఒక గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ కర్ణాటక గెలుపు జోష్ తో తెలంగాణలోనూ పాగా వేయాలని బలంగా కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ సైతం వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగి వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఒకవైపు బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉండటం, బీజేపీ నాయకులు కలసికట్టుగా ఉండటకపోవడాన్ని గమనించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ తో పాటు ఘర్ వాపసికి శ్రీకారం చుట్టాడు. కేసీఆర్ ను బలంగా ఢీకొడుతుందనుకున్న బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో అందరి కన్ను కాంగ్రెస్ పై పడింది. దీంతో పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయి మాడు పగలగొట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. నల్లగొండ జిల్లాలో తన శిష్యుడు చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరడం, తమ్ముడు రాజగోపాల్ బీజేపీలోకి పోవడంతో జిల్లాలో తన బలం తగ్గింది. తమ్ముడిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకుంటే జిల్లాలో తన బలం పెరుగుతుందని వెంకట్ రెడ్డి భావిస్తున్నాడు.

కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన అఖండ విజయంతో ఆయన తిరిగి కాంగ్రెస్ లోకి చేరతారనే వార్తలపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ది కోసం రాజీలేని పోరాటం చేశానని..ఈ పోరాటం కోసం తన ఎమ్మల్యే పదవిని కూడా వదులుకుని బీజేపీ చేరానని మునుగోడు ఎన్నికల్లో తిరిగి పోటీ చేసిన ఓడిపోయాను..అయినా బీజేపీని వీడను అంటూ స్పష్టంచేశారు. కానీ తాను తిరిగి కాంగ్రెస్ లో చేరతున్నానని ప్రచారం చేస్తున్నారని దీంట్లో ఎంత మాత్రం నిజంలేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో నేను ఓడిపోయినా నాకు బాధలేదని కానీ రేవంత్ రెడ్డి నాపై కామెంట్లు చేయటం సరికాదన్నారు. భేషరత్తుగా రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెబితే కాంగ్రెస్ పార్టీలో చేరాలో? లేదో ఆలోచించుకుంటానని పరోక్షంగా హింట్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి.

Also Read: Arjun Narendran: రికార్డుల రేసర్.. అర్జున్ నరేంద్రన్..!

Exit mobile version