Site icon HashtagU Telugu

Telangana Congress: ఐక్య‌త ఒట్టిమాటే..! కోమ‌టిరెడ్డి ట్వీట్ చేసిన పోస్ట‌ర్లో రేవంత్ ఫొటో మిస్‌..

Telangana Congress

Telangana Congress

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు మ‌రికొద్ది నెల‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ని గ‌ద్దెదించేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్ర‌మిస్తోంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు బీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం బీజేపీ (BJP) అని అంద‌రూ భావించారు. కానీ, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యంతో తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) లో జోష్ వ‌చ్చింది. కేంద్ర పార్టీ అధిష్టానంసైతం తెలంగాణ‌పై ప్ర‌త్యేక‌ దృష్టిసారించింది. ఇదే స‌మ‌యంలో పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు వంటి నేత‌లు ఆ పార్టీలో చేర‌డంతో మ‌రింత బ‌ల‌వ‌చ్చిన‌ట్ల‌యింది. అయితే, కాంగ్రెస్ పార్టీలోని నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త పోరు ఆ పార్టీశాపంగా మారింది. దీనిని గుర్తించిన కేంద్ర పార్టీ అధిష్టానం రేవంత్ స‌హా ముఖ్య‌నేత‌ల‌తో ఢిల్లీకి పిలిపించి చ‌ర్చ‌లు జ‌రిపింది.

ఇటీవ‌ల ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌తో రాహుల్ గాంధీ మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదు చేసుకున్న‌ట్లు తెలిసింది. ఈ క్ర‌మంలో రాహుల్ కాంగ్రెస్ నేత‌ల‌కు సీరియ‌స్‌గా వార్నింగ్ ఇచ్చార‌ని ఆ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతుంది. దీంతో రేవంత్‌, కోమ‌టిరెడ్డి వంటి నేత‌లు అంద‌రం క‌లిసి ఐక్యంగా ముందుకెళ్తామ‌ని, కేసీఆర్‌ను గ‌ద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సైతం కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లంతా క‌లిసిపోయార‌న్న భావ‌న‌కు వ‌చ్చారు. కానీ, తాజాగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్టు చేసిన పోస్ట‌ర్‌లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫొటో లేక‌పోవ‌టం చ‌ర్చ‌నీయంగా మారింది. దీంతో, కాంగ్రెస్ నేత‌లు ఐక్య‌తారాగం ఒట్టిమాటేనా అంటూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నారు.

పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంద‌ర్భంగా, భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర పూర్త‌వుతున్న సంద‌ర్భంగా ఖ‌మ్మంలో జూలై 2న భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. రాహుల్ గాంధీ ఈ స‌భ‌కు హాజ‌ర‌వుతున్నారు. ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి త‌న ట్విట‌ర్ ఖాతాలో ఓ పోస్టర్‌ షేర్ చేశారు. ఖ‌మ్మం గుమ్మంలో గ‌ర్జిద్దాం అంటూ.. సోనియా, ప్రియాంక‌, ఖ‌ర్గే, మాణిక్య ఠాకూర్‌ల‌తో పాటు రాహుల్ గాంధీ, భ‌ట్టి విక్ర‌మార్క‌, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఫొటోల‌తో ఉన్న పోస్ట‌ర్‌ను షేర్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫొటో లేక‌పోవ‌టం చ‌ర్చ‌నీయాంశ‌గా మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేత‌ల ఐక్య‌తారాగం ఒట్టిదేన‌ని మ‌రోసారి రుజువైంద‌ని ఆ పార్టీ శ్రేణులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

CM Jagan: ఢిల్లీకి సీఎం జ‌గ‌న్ .. 5న ప్ర‌ధాని మోదీ, అమిత్ షాల‌తో భేటీ.. టీడీపీకి బిగ్ షాక్ త‌ప్ప‌దా?