Site icon HashtagU Telugu

Komatireddy Venkata Reddy: వెంకట్ రెడ్డికి మరో షోకాజ్ నోటీస్.. రెస్పాన్స్ ఇచ్చేనా!

Komatireddy Venkatreddy, nalgonda

Komatireddy Venkatreddy

తెలంగాణ కాంగ్రెస్ లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) తీరు చర్చనీయాంశమవుతూనే ఉంది. ఆయనకు ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కాగా మునుగోడు ఉపఎన్నిక సమయంలో బీజేపీకి ఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఆయనకు గత నెల 22న అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అయితే ఆ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.

ఆ నోటీసులకు సంబంధించి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అధిష్టానం ఇచ్చిన నోటీసులు అందలేదని కోమటిరెడ్డి కార్యాలయం తెలిపింది. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి కి మరోసారి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మరి ఈసారైనా షోకాజ్ నోటీసులపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తారా లేదా అనేదిచూడాలి.