Komatireddy Venkat Reddy: నల్లగొండ అసెంబ్లీ స్థానంపై ‘కోమటిరెడ్డి’ గురి

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎక్కడ్నుంచో పోటీ చేస్తారో తేల్చి చెప్పారు.

  • Written By:
  • Updated On - December 12, 2022 / 04:50 PM IST

రాబోయే ఎన్నికల్లో నల్గొండ (Nalgonda) అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలనుకుంటున్నట్లు భువనగిరి లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) స్పష్టం చేశాడు. ఎన్నికలకు నెల రోజుల ముందు వరకు రాజకీయాల గురించి మాట్లాడనని ఆయన అన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్‌ ద్వారా వైద్య విద్యార్థులకు ఆర్థికసాయం అందజేశారు. అనంతరం నల్గొండలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని వెంకట్‌రెడ్డి అన్నారు. పీసీసీలో పదవులు తనకు ముఖ్యం కాదు అని, తెలంగాణ ఉద్యమం కోసం తాను గతంలో మంత్రి పదవికే రాజీనామా చేశాను. నా ప్రాధాన్యతలు ప్రజలతోనే ఉంటాయి’ అని కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) తేల్చి చెప్పారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల పునరేకీకరణపై వైఎస్‌ఆర్‌సి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. ఎన్నో త్యాగాల తర్వాత తెలంగాణను సాధించుకున్నామని, తెలంగాణను ఎప్పటికీ అణగదొక్కలేరని, ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని కోమటిరెడ్డి ఆంధ్రప్రాంత నేతలను కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులైన వారికే దళిత బంధు అందించాలని డిమాండ్ చేస్తూ, అమలులో తేడాలుంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు. నల్గొండ జిల్లాను అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఎన్ని హామీలు గుప్పించినా విఫలమయ్యారని వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు.

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీల్లో పలు మార్పులు, చేర్పులు చేసింది. అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీని 18మందితో ఏర్పాటు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నలుగురిని నియమించింది. 26 జిల్లాల అధ్యక్షులతో పాటు.. 24 మంది టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్లను, 84 మంది జనరల్‌ సెక్రటరీలను నియమించింది. ఐదు జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. అయితే ఏ కమిటీలోనూ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం కల్పించలేదు. గత కొద్దిరోజులుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు.. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని, బీజేపీ నేత, తన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డికి సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షోకాజు నోటీసులు జారీచేసింది. దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy)కి అవకాశం కల్పించలేదు.

Also Read: Revanth on Modi: మోడీ పాలనలో రూపాయి పతనం.. బీజేపీని నిలదీసిన రేవంత్!