Site icon HashtagU Telugu

Komatireddy Venkat Reddy: ఎంపీ పదవికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా..!

Komatireddy Venkat Reddy

Compressjpeg.online 1280x720 Image 11zon

Komatireddy Venkat Reddy: ఎంపీ పదవికి కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) రాజీనామా చేశారు. సోమవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను అందించారు. 2019లో వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా పదవి చేపట్టడంతో ఎంపీ పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది.

Also Read: Chiranjeevi Visits Yashoda Hospital : కేసీఆర్ ను పరామర్శించిన చిరంజీవి

సోమవారం సాయంత్రం 5.30గంటలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర అధికారులు కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సాయం అందించాలని చెప్పారు. హైదరాబాద్ – విజయవాడ రహదారిని ఆరు లైన్లకు విస్తరించే చర్యలు చేపట్టాలని నితిన్ గడ్కరీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. అంతకముందు మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున పార్లమెంటు సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. చెప్పిన మాట ప్రకారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

We’re now on WhatsApp. Click to Join.