Komatireddy Venkat Reddy : త్వరలోనే BRS దోపిడీ పత్రం రిలీజ్ చేస్తాం – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) గత బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ..తమ పాలనకు సంబదించిన వివరాలను తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నికల హామీలో ప్రకటించిన మహిళలకు బస్సు ఫ్రీ..ఆరోగ్య శ్రీ పెంపు ను అమలు చేయగా..ఈ నెల 28 నుండి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించబోతున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఇదిలా ఉంటె ఈరోజు మంగళవారం ప్రజా పాలనపై […]

Published By: HashtagU Telugu Desk
Nalgonda

Nalgonda

తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) గత బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ..తమ పాలనకు సంబదించిన వివరాలను తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నికల హామీలో ప్రకటించిన మహిళలకు బస్సు ఫ్రీ..ఆరోగ్య శ్రీ పెంపు ను అమలు చేయగా..ఈ నెల 28 నుండి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె ఈరోజు మంగళవారం ప్రజా పాలనపై ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా ఇన్ చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వ మోసాలను అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం ద్వారా విడుదల చేశామని..బీఆర్ఎస్ దోపిడీపై త్వరలోనే దోపిడీ పత్రం విడుదల చేస్తామని కీలక ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బీఆర్ఎస్ చేసిన అవినీతిని బయటకు తీస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేల కోట్లు తిన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని నిప్పులు చెరిగారు.

డిసెంబర్28 నుండి జనవరి 6 వరకు ప్రజా పాలన పారదర్శకంగా చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, ప్రాజెక్టుల వద్దే కుర్చీ వేసుకుని.. నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్న వారిలా తాము ఉండమన్నారు. పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also : Mushroom Benefits : పుట్టగొడుగు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

  Last Updated: 26 Dec 2023, 08:04 PM IST