తెలంగాణ (Telangana) లో మరోసారి ఎన్నికల హడావిడి మొదలైంది. మరో నెల రోజుల్లో లోక్ సభ (Lok Sabha Elections)ఎన్నికలు జరగనున్న క్రమంలో అన్ని పార్టీలు తమ ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంఖా మోగించిన కాంగ్రెస్..లోక్ సభ ఎన్నికల్లోనూ అదే రిపీట్ చేయాలనీ చూస్తుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ దే విజయం అన్నట్లు సర్వేలు చెపుతున్నాయి. దీంతో చాలామంది టికెట్ల కోసం కసరత్తులు చేస్తున్నారు . ఇతర పార్టీల నేతలు సైతం పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరి టికెట్స్ దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ లో ఉన్న సీనియర్ నేతలు..తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ (Komatireddy Rajagopal) సైతం తన భార్య కు భువనగిరి ఎంపీ టికెట్ (Bhuvanagiri MP Ticket ) ఇవ్వాలని కోరుతున్నట్లు రెండు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు చూసి చాలామంది కోమటిరెడ్డి ఫై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అన్నదమ్ములకు టికెట్స్ ఇచ్చారు..ఒకర్ని మంత్రిగా కూడా చేసారు అయినప్పటికీ ఇంకా పదవి దాహం పోలేదని మండిపడుతున్నారు. దీంతో టికెట్ వార్తలపై స్పందించారు. ఎంపీ టికెట్ కోసం నా భార్య ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. భువనగిరి టికెట్ విషయంలో కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అంతేకానీ, తమ కుటుంబానికి మూడో టికెట్ కోరుకోవడం లేదని అన్నారు. భువనగిరి టికెట్ బీసీలకు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరినీ విడదీసే వ్యక్తులు కాదని అన్నారు. తాము పదవులు, అధికారం కోసం ఏనాడూ పాకులాడలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also : Gannavaram : కడప టీడీపీ అభ్యర్థి మాధవిపై వైసీపీ శ్రేణులు దౌర్జన్యం..