అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు కృష్ణా (Krishna) ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ(KRMB) సంబంధిత అంశాలపై వాడి వేడి చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) వివరించగా..అటు బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సమాదానాలు చెపుతూ వచ్చారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ..మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కు భారీ ఆఫర్ ప్రకటించారు.
బిఆర్ఎస్ లో హరీష్ రావుకు భవిష్యత్ లేదని, బిఆర్ఎస్ నుండి 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి వస్తే..హరీష్ రావు కు దేవాదాయశాఖ మంత్రి పదవి ఇస్తామన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో చేసిన పాపాలు కడుక్కోవడానికి హరీష్ రావును దేవాదాయ శాఖ మంత్రిగా అవకాశం ఇస్తామని రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో మా పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను వాళ్ళు తీసుకోలేదా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. వన్ థర్డ్ ఒకే సారి 26 మంది ఎమ్మెల్యే లతో హరీష్ రావు కాంగ్రెస్‌లోకి రావాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు , కడియంలా తాము జీ హుజూర్ బ్యాచ్ కాదని , పదవుల కోసం మేం పాకులాడే వాళ్లం కాదన్నారు.. ప్రజల కోసం ఉండేవాళ్లమన్నారు. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని , కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకురావాలని చూస్తున్నారని ఆయన ఆ పార్టీపై ఆరోపణలు చేశారు. గతంలో తమకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేసారని, ఇప్పుడు తెలంగాణను కాపాడుకునే బాధ్యత తమపై పడిందన్నారు.
Read Also : AP : అమరావతి పేరుతో టీడీపీ దోచుకుంది – వైసీపీ ట్వీట్