Site icon HashtagU Telugu

Komatireddy Rajagopal Reddy : బిజెపి ని వీడడం ఫై కోమటిరెడ్డి రాజగోపాల్ క్లారిటీ

Rajagopal

Rajagopal

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు పార్టీలలో వలసల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లోకి పెద్ద ఎత్తున అధికార పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఈ క్రమంలో బిజెపి (BJP) నుండి కూడా పలువురు కీలక నేతలు కాంగ్రెస్ (Congress) గూటికి చేరబోతున్నట్లు గత కొద్దీ రోజులుగా ప్రచారం అవుతున్నాయి. వీరిలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ (Komatireddy Rajagopal Reddy) సైతం చేరబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆ వార్తలపై రాజగోపాల్ ట్విట్టర్ (X) ద్వారా క్లారిటీ ఇచ్చారు.

నేను బిజెపి నుండి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నానంటూ కొన్ని పత్రికలు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నా. నేను వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదు. నా చుట్టూ ఉన్న సమాజానికి నా వంతు మంచి చేయాలన్న లక్ష్యంతో రాజకీయ మార్గాన్న ఎంచుకున్న వ్యక్తిని. ఆ దిశనగానే ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఎక్కడా అవినీతి, వ్యక్తిగత స్వార్ధం లేకుండా నీతి నిజాయితీగా పనిచేస్తూ వచ్చాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం నా ఎంపీ పదవికి రాజీనామా చేశాను. స్వరాష్ట్ర సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను. కానీ పద్నాలుగు వందల మంది ఆత్మబలిదానాలు, వేలాది యువజన, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు ..సబ్బండ వర్గాల ఒక్కటై తెచ్చుకున్న తెలంగాణలో రాజకీయ పరిణామాలు నన్ను ఎంతో కలిచివేశాయి.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో ప్రజాస్వామ్య, బహుజన రాజ్యం కోసం బీజేపీ పార్టీలో చేరానని..ప్రజా తెలంగాణకు బదులు ఒక కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్టు ప్రస్తుత పరిస్థితి తయారైందని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజాపాలకుడిలా కాక నిజాం రాజులా నియంతృత్వ పోకడలు పోతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రజారాజ్యం ఏర్పాటు కోసమే తాను గతేడాది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరానని గుర్తు చేశారు. దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆంక్షలకు అనుగుణంగా ముందుకు నడిపించే శక్తి ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షా‌కు ఉందని తెలిపారు. కేసీఆర్ అవినీతిని ఎండగట్టి కుటుంబ తెలంగాణకు బదులు బహుజన తెలంగాణ ఏర్పాటు చేసే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు. ఈ దిశగా పార్టీలో సైనికుడిలా ముందుకు కదులుతానని స్పష్టం చేశారు.

మునుగోడులో కేసీఆర్, అయన ఎమ్మెల్యేలు ఇక్కడే మకాం పెట్టినా.. నా మీద, బీజేపీ మీద మునుగోడు ప్రజలు అచంచల విశ్వాసాన్నే చూపారు. కేసీఆర్ అవినీతిని కక్కించి, కుటుంబ తెలంగాణ బదులు ప్రజాస్వామిక, బహుజన తెలంగాణ ఏర్పాటు చేసే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది. నేనే కాదు ముఖ్య నాయకులెవరూ బీజేపీని వీడరు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులై ముందుకు కదులుతున్నాం. భారత్ మాతాకీ జైట’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు.

Read Also : Annaya : అనన్య అందాల కోసం కుర్రాళ్ళ యుద్దాలు చేస్తారేమో

https://twitter.com/rajgopalreddy_K/status/1709955925031923843

Exit mobile version